AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనాని క్షణాల్లో గుర్తించొచ్చు..! బ్రీతింగ్ అనలైజరే ఆదర్శమట..!

ప్రపంచ దేశాల్ని వణికిస్తోన్న కరోనా వైరస్ గురించి తెలిసిందే. ఈ వైరస్ బారిన పడితే.. బతకడమన్నది కష్టమే. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి.. ఇప్పటికే మూడు వేల మందికి పైగా ప్రాణాలను తీసింది. అయితే ఈ భయంకరమైన వైరస్‌ను గుర్తించడం..

కరోనాని క్షణాల్లో గుర్తించొచ్చు..! బ్రీతింగ్ అనలైజరే ఆదర్శమట..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 04, 2020 | 8:27 PM

Share

ప్రపంచ దేశాల్ని వణికిస్తోన్న కరోనా వైరస్ గురించి తెలిసిందే. ఈ వైరస్ బారిన పడితే.. బతకడమన్నది కష్టమే. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి.. ఇప్పటికే మూడు వేల మందికి పైగా ప్రాణాలను తీసింది. అయితే ఈ భయంకరమైన వైరస్‌ను గుర్తించడం.. తొలుత శాస్త్రవేత్తలకు ఓ పెద్ద టాస్క్‌గా మారింది. ఆ తర్వాత వైరస్ లక్షణాలు ఉన్నాయా లేదా అన్నది గుర్తించడానికి కనీసం 24 గంటల నుంచి 48 గంటల సమయం పడుతోంది. అయితే ఈ వైరస్‌ను త్వరితగతిన గుర్తించేందుకు లండన్ శాస్త్రవేత్తలు రంగంలోకి దిగారు.

ఇక ఈ కరోనా వైరస్‌ (కొవిడ్‌-19)ను క్షణాల్లోనే గుర్తించవచ్చంటున్నారు. న్యూకాజల్‌లోని నార్తుంబ్రియా యూనివర్శిటీకి చెందిన పరిశోధకుల బృందం.. బ్రీతింగ్ ద్వారా ఈ కరోనా వైరస్‌ను గుర్తించవచ్చంటున్నారు. దీనికి సంబంధించి ఓ బయో మీటర్‌ను కనుగొన్నారు. ప్రస్తుతం రోగుల లాలాజలాన్ని ల్యాబ్‌కు పంపించి పరీక్షించడం ద్వారా.. కరోనా లక్షణాలను గుర్తిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియ ద్వారా కనుగునేందుకు దాదాపు రెండు రోజుల సమయం పడుతోంది. ఇప్పుడు వచ్చే కొత్త ప్రాసెస్ ద్వారా.. కరోనా వైరస్స్‌ సోకిందీ లేనిదీ.. కొన్ని క్షణాల్లోనే కనుగొనవచ్చు.

ఈ బయో మీటర్‌ను తయారు చేసేందుకు.. బ్రీత్ అనలైజర్‌ పని చేసేవిధానాన్ని ప్రామాణికంగా తీసుకుని తయారు చేశారు. మద్యం మత్తులో వాహనాదారులను గుర్తించేందుకు పోలీసులు ఉపయోగిస్తున్న “బ్రీతింగ్‌ అనలైజర్‌” లాగే.. ఈ బయోమీటర్ కూడా పనిచేస్తుందని, అయితే ఇందులో డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏ, ప్రొటీన్లు, ఫ్యాట్‌ మాలెక్యూల్స్‌ ఉంటాయని పరిశోధకులు వెల్లడించారు. అయితే ఈ కరోనా వైరస్‌ను మాత్రమే కాకుండా.. ఇతర ఊపిరితిత్తుల జబ్బులను, క్యాన్సర్, మధు మేహం లాంటి జబ్బులను కూడా దీని ద్వారా గుర్తించేందుకు వీలుంటుందని చెబుతున్నారు. విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్ల వద్ద ప్రయాణికులను ఈ బయో మీటర్ల ద్వారా చెక్ చేయడం సులభంగా ఉంటుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. వెంటనే వీటి ఉత్పత్తులను చేపట్టి ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తామంటున్నారు.

Follow Us
గ్యాస్ ట్రబుల్ ను తగ్గించి పేగులను క్లీన్ చేసే హై ప్రోటీన్ కూర
గ్యాస్ ట్రబుల్ ను తగ్గించి పేగులను క్లీన్ చేసే హై ప్రోటీన్ కూర
ఈ జామ రైతు సక్సెస్ సీక్రెట్ తెలిస్తే.. మీరూ ఫాలో అవుతారు..
ఈ జామ రైతు సక్సెస్ సీక్రెట్ తెలిస్తే.. మీరూ ఫాలో అవుతారు..
తెలుగు యువతకు జర్మనీలో భారీగా ఉద్యోగాలు.. నెలకు రూ.3.30లక్షల జీతం
తెలుగు యువతకు జర్మనీలో భారీగా ఉద్యోగాలు.. నెలకు రూ.3.30లక్షల జీతం
శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ రికార్డులు బ్రేక్ చేసిన పంత్
శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ రికార్డులు బ్రేక్ చేసిన పంత్
2027లో ఆహార ధరలకు రెక్కలు..! ఎరువుల కొరత, ఎల్ నినోతో భారత్‌కు..
2027లో ఆహార ధరలకు రెక్కలు..! ఎరువుల కొరత, ఎల్ నినోతో భారత్‌కు..
స్టార్ హీరోతో విబేధాలు.. కొడుకు కోసం ఆస్తిమొత్తం పోగొట్టుకున్నాడు
స్టార్ హీరోతో విబేధాలు.. కొడుకు కోసం ఆస్తిమొత్తం పోగొట్టుకున్నాడు
23 ఏళ్ల చిన్నదానితో రిలేషన్.. పెళ్లి మాత్రం చేసుకోను..!
23 ఏళ్ల చిన్నదానితో రిలేషన్.. పెళ్లి మాత్రం చేసుకోను..!
జ్వరం వచ్చిందని యాంటీబయాటిక్స్‌ ఎడాపెడా వాడొద్దు.. ఎందుకంటే!
జ్వరం వచ్చిందని యాంటీబయాటిక్స్‌ ఎడాపెడా వాడొద్దు.. ఎందుకంటే!
60 ఏళ్లలో మన తాతలు బలంగా ఉన్నారంటే.. ఈ గారెల వల్లే
60 ఏళ్లలో మన తాతలు బలంగా ఉన్నారంటే.. ఈ గారెల వల్లే
22A భూములపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన..
22A భూములపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన..