AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇద్దరు భార్యలకు విడాకులు.. 23 ఏళ్ల చిన్నదానితో రిలేషన్.. పెళ్లి మాత్రం చేసుకోను..! ఓపెన్‌గా చెప్పిన దర్శకుడు

బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ తన గర్ల్‌ఫ్రెండ్ శుభ్రా శెట్టితో ఉన్న 23 ఏళ్ల వయసు వ్యత్యాసం, వారి సంబంధం, పెళ్లిపై అభిప్రాయాలను పంచుకున్నారు. శుభ్రాకు పెళ్లిపై నమ్మకం లేదని, ఇద్దరూ సంతోషంగా జీవించడానికే ప్రాధాన్యత ఇస్తున్నామని అనురాగ్ తెలిపారు. వయసు వ్యత్యాసం వల్ల ఎదురైన అభద్రతాభావం, దానిని అధిగమించిన తీరు గురించి కూడా వివరించారు.

ఇద్దరు భార్యలకు విడాకులు.. 23 ఏళ్ల చిన్నదానితో రిలేషన్.. పెళ్లి మాత్రం చేసుకోను..! ఓపెన్‌గా చెప్పిన దర్శకుడు
Anurag Kashyap
Rajeev Rayala
|

Updated on: Aug 19, 2026 | 10:06 AM

Share

బాలీవుడ్ ప్రముఖ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ తన వ్యక్తిగత జీవితం కారణంగా మరోసారి వార్తల్లో నిలిచారు. తన గర్ల్‌ఫ్రెండ్ శుభ్రా శెట్టితో దాదాపు ఒక దశాబ్దానికి పైగా రిలేషన్‌షిప్‌లో ఉన్న అనురాగ్, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వారి సంబంధం గురించి, ఏజ్ గ్యాప్ గురించి, అలాగే పెళ్లి గురించి తన అభిప్రాయాలను బహిరంగంగా పంచుకున్నారు. అనురాగ్, శుభ్రా మధ్య దాదాపు 23ఏళ్ల వయసు వ్యత్యాసం ఉంది. అలాగే శుభ్రా శెట్టికి పెళ్లిపై అంతగా నమ్మకం లేదని అనురాగ్ చెప్పుకొచ్చాడు. అందుకే, పెళ్లి కన్నా ఇద్దరూ కలిసి సంతోషంగా జీవించడానికే   ప్రాధాన్యత ఇస్తున్నాం అని ఆయన స్పష్టం చేశారు. తాను శుభ్రాతో చాలా సంతోషంగా ఉన్నానని, ఆమెతోనే తన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నానని అనురాగ్ తెలిపారు. ఈ బంధాన్ని కాపాడుకోవడానికి తాను ఎంత దూరమైనా వెళ్తానని ఆయన అన్నారు. ఈ క్రమంలోనే, ఏజ్ గ్యాప్ గురించి కూడా అనురాగ్ మాట్లాడారు. వయసు పైబడిన వ్యక్తికి ఇలాంటి సంబంధాలలో ఎలాంటి అభద్రతాభావం ఉంటుందని ఆయన ప్రశ్నించారు. తాను ప్రేమించే వ్యక్తులతో ఎక్కువ సమయం గడపడానికి ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నానని అనురాగ్ చెప్పారు. జీవితంలో చాలా జరుగుతుంటాయని, కానీ ప్రస్తుతం తన దగ్గర ఉన్నదానితో సంతోషంగా ఉన్నానని, దాన్ని కోల్పోవాలనుకోవడం లేదని ఆయన అన్నారు.

అనురాగ్ మరియు శుభ్రా మధ్య ఉన్న 23 ఏళ్ల ఏజ్ గ్యాప్ కారణంగా తానూ చాలాసార్లు ఇబ్బంది పడ్డానని అనురాగ్ అన్నారు. ఒకానొక సమయంలో, ఈ సంబంధంపై ఆయన ఎంత అసౌకర్యానికి గురయ్యారంటే, ఆయన శుభ్రా నుంచి దూరంగా ఉండటానికి కూడా ప్రయత్నించారట.. దీనికి కారణం, ఆయన వయసు పెరిగేకొద్దీ శుభ్రా మరింత యవ్వనంగా కనిపించడం. ఈ కారణంగానే వారి బంధంపై ఆయనకు కాస్త వింతగా అనిపించిందట. ప్రజలు వారి సంబంధం అలాగే  ఏజ్ గ్యాప్ గురించి ఏమనుకుంటున్నారోనని కూడా ఆయనకు అనిపించేది. అయితే, కాలక్రమేణా ఆయన ఆ ఇబ్బందిని అధిగమించారట. ఇప్పుడు తాను శుభ్రాతో సంతోషంగా ఉన్నానని, తన సంబంధం పట్ల పూర్తిగా సంతృప్తిగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు.

శుభ్రా శెట్టి ఎవరు అనే విషయానికి వస్తే, ఆమె ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందినవారే. ఆమె అనురాగ్ కశ్యప్ ప్రొడక్షన్ కంపెనీ అయిన ఫాంటమ్ ఫిల్మ్స్‌లో కూడా పనిచేశారు అలాగే అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. శుభ్రా సాధారణంగా లైమ్‌లైట్‌కు దూరంగా ఉండటానికే ఇష్టపడతారు. అనురాగ్‌తో ఆమె సంబంధం గురించి చర్చలు దాదాపు 2015లో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ఇద్దరూ తమ బంధాన్ని బయట పెట్టారు. గత కొన్ని సంవత్సరాలుగా, ఇద్దరూ తమ వ్యక్తిగత జీవితాన్ని చాలా వరకు ప్రైవేట్‌గా ఉంచారు. ఇక అనురాగ్ కశ్యప్‌కు ఇంతకుముందు రెండు వివాహాలు జరిగాయి. శుభ్రా శెట్టి కంటే ముందు, అనురాగ్ కశ్యప్ ఫిల్మ్ ఎడిటర్ ఆర్తి బజాజ్‌ను మొదట వివాహం చేసుకున్నారు. వారిద్దరూ 2009లో విడాకులు తీసుకున్నారు.  వీరికి ఆలియా కశ్యప్ అనే కుమార్తె ఉంది. ఆ తర్వాత అనురాగ్ నటి కల్కి కోచ్లిన్‌ను వివాహం చేసుకున్నారు. వారిద్దరూ దేవ్ డి సినిమా సమయంలో కలుసుకున్నారు. వారు పెళ్లి చేసుకున్నారు, కానీ కొన్నాళ్ల తర్వాత వారి బంధం ముగిసింది మరియు 2015లో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :

ఇన్నాళ్ల తర్వాత కనిపించింది మావ..! బిందాస్ బ్యూటీ ఎంత మారిపోయింది .!!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us