Work From Home: నా భర్తను వెంటనే ఆఫీసుకు పిలవండి.. లేకపోతే మేము డైవర్స్ తీసుకుంటామేమో అంటూ ఓ ఉద్యోగి భార్య ఆవేదన

Surya Kala

Surya Kala |

Updated on: Sep 12, 2021 | 7:28 PM

Harsh Goenka on Twitter: కరోనా వైరస్ వెలుగులోకి రాకముందు.. ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఎగిరి గంతేసేవారు. ఇక కోవిడ్ కల్లోలాన్ని అరికట్టడానికి నివారణ చర్యల్లో భాగంగా చాలా కంపెనీలు ఇంటివద్దనే పనిచేసే..

Work From Home: నా భర్తను వెంటనే ఆఫీసుకు పిలవండి.. లేకపోతే మేము డైవర్స్ తీసుకుంటామేమో అంటూ ఓ ఉద్యోగి భార్య ఆవేదన
Harsh Goenka

Follow us on

Harsh Goenka on Twitter:  కరోనా వైరస్ వెలుగులోకి రాకముందు.. ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఎగిరి గంతేసేవారు. ఇక కోవిడ్ కల్లోలాన్ని అరికట్టడానికి నివారణ చర్యల్లో భాగంగా చాలా కంపెనీలు ఇంటివద్దనే పనిచేసే వీలు కల్పించాయి. ఇక ఏడాదిన్నర నుంచి చాలా రంగాల్లోని ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. అయితే ఇది కొందరికి ఇష్టంగా మారితే.. మరికొందరికి కష్టంగా మారింది. ఓ ప్రవేయిట్ ఉద్యోగి భార్య.. తన భర్త పనిచేస్తున్న ఓ కంపీనీకి రాసిన లెటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అంతేకాదు.. ఇంటి దగ్గర ఉద్యోగం చేయడం వలన ఏ విధమైన సమస్యలు ఎదుర్కొంటున్నారో తెలియజెడానికి ఇది ఒక ఉదాహరణగా మారింది అంటున్నారు. మరి లెటర్ లో ఏముందో వివరాల్లోకి వెళ్తే..

కోవిడ్ ని నివారణించడానికి ఏడాదిన్నరకు పైగా కోట్లాది మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. అయితే ఇలా ఇంటిదగ్గర ఉద్యోగ విధులు నిర్వహించడంపై చాలామంది సంతోషంగా ఉన్నారు అని భావిస్తున్నారు. కానీ అయితే వస్తావ పరిస్థితులు అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయని.. అందరూ అనుకుంటున్నట్లు వర్క్ ఫ్రం హోంతో ఉద్యోగులు, ఆ కుటుంబ సభ్యులు పూర్తిగా హ్యాపీలా లేరని తెలుస్తోంది. కొంతమంది ఉద్యోగులు ఇంట్లోనే ఉండటం వల్ల ఎంత సేపు పని చేస్తున్నాం.. ఏం తింటున్నాం? అనే విషయాన్ని కూడా పట్టించుకోవట్లేదట. ఇదే విషయాన్నీ ప్రస్తావిస్తూ.. ప్రముఖ పారిశ్రామికవేత్త హర్షా గోయంక కంపెనీ లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి భార్య ఓ లేఖ రాశారు. ఆ లెటర్ ను గోయంక ట్విట్టర్ లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ లెటర్ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.

ఈ లెటర్ లో వర్క్ ఫ్రం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను ప్రస్తావించారు. అందులో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు స్పష్టంగా ఉన్నాయి. .. సర్​.. నేను మీ సంస్థలో పని చేసే ఉద్యోగి మనోజ్ భార్యను. ప్లీజ్​ మీరు నా భర్తను వెంటనే ఆఫీస్​ నుంచి పని చేసేందుకు అనుమతివ్వండి.వ్యాక్సిన్ రెండు దోషులను తీసుకున్నారు.. అంతేకాదు కొవిడ్​కు సంబంధించి అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నారు. కనుక ఇక నుంచి అయినా ఆఫీస్ లో ఉద్యోగబాధ్యతలను నిర్వహించే అవకాశం కల్పించండి అని కోరారు. ఇలా మనోజ్ ఇంకొన్ని రోజులు వర్క్ ఫ్రం హోం అంటూ ఇంట్లోనే ఉంటే ఆ ఎఫెక్ట్ మా వైవాహిక బంధంపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే మా వివాహ బంధానికి ముగింపు పలకాల్సి వస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే మనోజ్ పనిచేస్తూ.. రోజుకు పది సార్లు కాఫీ తాగుతున్నారు. ఇక ఇంట్లోని గదులలో తిరుగుతూ మళ్ళీ మళ్ళీ తింటున్నారు. ఇక గదులను శుభ్రం లేకుండా చెత్త కుప్పగా చేస్తున్నారు. అంతేకాదు నిత్యం ఆఫీస్ ఫోన్ కాల్స్ లో ఉంటూ.. నిద్రకూడా సరిగ్గా పోవడంలేదు.

మాకు ఇద్దరు పిల్లలు.. వారిని చేసుకోవడానికే నాకు సమయం సరిపోవడంలేదు.. ఇప్పుడు రోజూ ఇంట్లో ఉండే నా భర్త చేస్తున్న పనులతో నాకు అదనంగా పనిభారం పెరిగింది. కనుక నా వివాహ బంధం నిలబడాలంటే.. మీ సపోర్ట్ అవసరం అంటూ గోయంకకు తన ఆవేదనను తెలియజేశారు. ఈ లెటర్ లో గోయంకా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఆమె బాధ నాకు అర్ధం అయ్యింది. అయితే ఏమని సమాధానం చెప్పాలో అర్ధం కావడం లేదు అని కామెంట్ జతచేశారు. ఈ లెటర్ పై నెటిజన్లు చేస్తున్న కామెంట్స్ ఫన్నీగా ఉండి నవ్వులు పూయిస్తూనే.. కొన్ని ప్రస్తుత ఉద్యోగస్తుల బాధలు.. ఆ కుటుంబంలో సమస్యలు తెలియజేస్తున్నారు.

Also Read: Suman on Drug Case: సినీ ఫిల్డ్‌లో మాత్రమే కాదు.. అన్ని చోట్లా ‘డ్రగ్స్ దందా’ ఉంది.. సుమన్ సెన్సేషనల్ కామెంట్స్.

Vinayaka Chavithi: అక్కడ మండపంలో గణపతి చుట్టూ తిరుగుతూ ఎలక్షన్స్‌లో గెలిపించమని కోరుతున్న అభ్యర్థులు .. ఎక్కడంటే..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu