క‌రోనా వైర‌స్‌తో వైసీపీ లీడ‌ర్ మృతి

క‌రోనా వైర‌స్‌తో వైసీపీ లీడ‌ర్ మృతి

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా వైర‌స్ క‌ల్లోలం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే రెండున్న‌ర ల‌క్ష‌లు దాటేశాయి కోవిడ్ కేసులు. అలాగే ఇప్ప‌టికే ఎంతో మంది రాజ‌కీయ ప్ర‌ముఖులు, సినీ, క్రీడా సెల‌బ్రిటీలు ఈ వైర‌స్ బారిన పడుతూనే ఉంటున్నారు. సామాన్యుల‌తో పాటు వీరికి..

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 13, 2020 | 7:00 PM

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా వైర‌స్ క‌ల్లోలం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే రెండున్న‌ర ల‌క్ష‌లు దాటేశాయి కోవిడ్ కేసులు. అలాగే ఇప్ప‌టికే ఎంతో మంది రాజ‌కీయ ప్ర‌ముఖులు, సినీ, క్రీడా సెల‌బ్రిటీలు ఈ వైర‌స్ బారిన పడుతూనే ఉంటున్నారు. సామాన్యుల‌తో పాటు వీరికి కూడా కోవిడ్ సోక‌డం ప్ర‌జ‌లను ఆందోళ‌న‌కు గురి చేస్తుంది. ఇప్ప‌టికే రోజు రోజుకీ దేశ వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. నిన్న‌టికి నిన్న టీడీపీ నేత ఒక‌రు మ‌ర‌ణించ‌గా ఈ రోజు వైసీపీ నేత ఒక‌రు కోవిడ్ సోకి మ‌ర‌ణించారు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా కొవ్వూరులోని కుమార దేవం గ్రామానికి చెందిన‌ ఏఎంసి ఛైర్మ‌న్ యాండ‌ప‌ల్లి ర‌మేష్ మ‌ర‌ణించారు. స‌హాయం కోరి వ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌రికి అన్ని వేళ‌లా అందుబాటులో ఉంటూ ప్ర‌జానాయ‌కుడ‌ని గ్రామ‌స్తుల మ‌న్న‌న‌లు పొందిన ఆయ‌న మ‌ర‌ణించ‌డంతో పార్టీ కార్య‌క‌ర్త‌లు దిగ్బ్రాంతికి లోన‌య్యారు.

Read More:

కోమాలో మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణబ్ ముఖ‌ర్జీః ఆర్మీ రీసెర్చ్ హాస్పిట‌ల్‌

భార‌త క్రికెట‌ర్‌కి క‌రోనా వైర‌స్ పాజిటివ్‌

అభిరామ్ యాక్సిడెంట్ చేయ‌లేదు.. క్లారిటీ ఇచ్చిన ద‌గ్గుబాటి ఫ్యామిలీ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu