Vaccination: టీకాలు వేయడంలో ఇజ్రాయిల్ సూపర్ స్పీడ్..కరోనాకు కళ్లెం వేసే దిశలో వేగంగా అడుగులు..

కరోనా వైరస్.. ఈ పేరు మొదట వినేసరికి ప్రపంచంలో ఎవరికీ దీనిగురించి ఏమాత్రం తెలీదు. క్రమంగా అది విస్తరించుకుంటూ పోతున్న సమయంలో అసలు ఆ వైరస్ లక్షణాలు..ఎలా వ్యాపిస్తుంది

Vaccination: టీకాలు వేయడంలో ఇజ్రాయిల్ సూపర్ స్పీడ్..కరోనాకు కళ్లెం వేసే దిశలో వేగంగా అడుగులు..
Vaccination
Follow us

|

Updated on: Apr 14, 2021 | 4:47 PM

Vaccination: కరోనా వైరస్.. ఈ పేరు మొదట వినేసరికి ప్రపంచంలో ఎవరికీ దీనిగురించి ఏమాత్రం తెలీదు. క్రమంగా అది విస్తరించుకుంటూ పోతున్న సమయంలో అసలు ఆ వైరస్ లక్షణాలు..ఎలా వ్యాపిస్తుంది..ఎంత ప్రమాదాన్ని తీసుకొస్తుంది.. దీనివలన ఎదురయ్యే ఆరోగ్యసమస్యలు ఏమిటి ఇటువంటి ప్రశ్నలకు ఎవరిదగ్గరా సమాధానం లేదు. ఒక్కోసారి సమాధానం వచ్చినా అది ఎంతవరకూ సరైనదో చెప్పే ఆధారాలూ లేవు. ఏడాది క్రితం పరిస్థితి ఇది. కోవిడ్ వచ్చింది.. ప్రపంచాన్ని చుట్టేసింది..వేగంగా ప్రపంచమంతా స్తబ్దుగా మారిపోయింది. కరోనాకు చికిత్స ఎలా చేయాలనేది తెలీని అయోమయ పరిస్థితి. రోగాలక్షణాలను బట్టి చికిత్స చేస్తూ వచ్చారు వైద్యులు. ఇప్పుడు పరిస్థితి మారింది. టీకా అందుబాటులోకి వచ్చింది. చాలా దేశాలు యద్ద ప్రతిపాదికన వ్యాక్సినేషన్ చేస్తున్నాయి. వాటి ఫలితాలు ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో మొదటి స్థానంలో నిలిచింది ఇజ్రాయిల్.

చికిత్స ఎలానో తెలీని స్థితి నుంచి టీకా దాకా.. ఇంతకు ముందు డెంగీ లాంటి వైరస్ వ్యాధులు విజృంభించినా వాటికి వ్యాక్సిన్లు తాయారు చేయలేకపోయారు. ఇప్పుడు కరోనా విషయంలోనూ అదే జరుగుతుందని అంతా భావించారు. కానీ, చాలా వేగంగా వ్యాక్సిన్ కనిపెట్టడానికి ప్రయోగాలు చేశారు. అమెరికాలో వ్యాక్సిన్ ప్రయోగాలు మొదలయ్యాయి. తరువాత చైనా..రష్యా.. ఇజ్రాయిల్ ఇలా వరుసగా చాలా దేశాలు టీకాల పై ప్రయోగాలు మొదలయ్యాయి. మనదేశంలో కూడా భారత్ బయోటెక్ సంస్థ శరవేగంగా ప్రయోగాలు మొదలెట్టింది. దీనికి కేంద్ర ప్రభుత్వమూ ఎక్కడా రాజీపడకుండా సహకరించింది. మొదట రష్యా టీకాను కనిపెట్టినట్టు ప్రకటించింది. దీంతో వ్యాక్సిన్ సిద్ధం చేసే పనులు పోటాపోటీగా సాగాయి. అమెరికాలోని ఫైజర్ బయో ఎన్టెక్ సంస్థ డిసెంబర్ 14న వ్యాక్సినేషన్ కు అత్యవసర అనుమతులు సాధిచింది. మరోవైపు చైనా, రష్యాలు అనధికారికంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలు పెట్టేశాయి. ఆ తరువాత చాలా దేశాలు ఇదేబాట పట్టాయి. ఇది వ్యాక్సిన్ చరిత్ర.

ఇజ్రాయిల్ లో వేగంగా.. పదిలక్షల జనాభాకంటే ఎక్కువున్న దేశాల్లో ఇజ్రాయిల్ అత్యధికంగా ప్రతి 100 మందికి 118 డోసులు ఇచ్చి ముందు వరుసలో నిలిచింది. తరువాత 91 డోసులతో యూఏఈ, 63 వసూలతోఁచిలే, 59 డోసులతో యూకే, 55 డోసులతో అమెరికా, 42 దోసుల్లతో సెర్బియా, 42 డోసులతో హంగేరీ, 37 డోసులతోఖాతర్.. 29 డోసులతో ఉరుగ్వేలు ఏప్రిల్ 12 నాటికి టాప్ టెన్ లో నిలిచాయి.

ఇజ్రాయిల్ లో ఫలితాలు కనిపిస్తున్నాయి.. వ్యాక్సినేషన్ ఫలితాలు ఇప్పటికే ఇజ్రాయిల్ లో కనిపిస్తున్నాయి. ఇక్కడ వ్యాక్సినేషన్ మొదలైన తొలిరోజుల్లో కేసుల తీవ్రత అధికం అయింది. దీంతో ఆ దేశం వ్యాక్సినేషన్ ను వేగవంతం చేసింది. ఏప్రిల్ 12 తేదీకి దాదాపు 60 శాతం మంది ప్రజలకు టీకాలు అందాయి. ఇక్కడ మొత్తం జనాభా 90 లక్షలు.. వీరిలో 8. 30 లక్షల మందికి కోవిడ్ సోకడంతో ముందే యాంటీబాడీలు లభించాయి. 53 లక్షల మందికి టీకాలు వేశారు. హెర్డ్ ఇమ్యూనిటీకి 70 శాతం మంది ప్రజల్లో యాంటీ బాడీలు ఉంటె చాలనే లెక్కలు ఉన్నాయి. ఈ లెక్కల ప్రకారం చూస్తే.. ఇజ్రాయిల్ హెర్డ్ ఇమ్యూనిటీకి దగ్గరగా ఉంది. ఏప్రిల్ 13వ తేదీనాటికి అక్కడ కేసుల సంఖ్య200కి పరిమితం అయిపోవడం వ్యాక్సినేషన్ విజయవంతం అయింది అందానికి సూచికగా చెప్పొచ్చు అంటున్నారు వైద్య నిపుణులు .

డిసెంబర్ 19 నుంచి వ్యాక్సినేషన్ మొదలు పెట్టిన ఇజ్రాయిల్ జనవరి 19 నాటికి 25 శాతం ప్రజలకు టీకాలు మొదటి డోసు ఇచ్చేసింది. అదేవిధంగా వ్యాక్సిన్ల కొనుగోలులో ఆ దేశం చాలా దూకుడుగా వ్యవహరించింది జూన్ 2020లోనే మోడెర్నా తో వ్యాక్సిన్ కొనుగోలుకు ఒప్పందం చేసుకున్న ఇజ్రాయిల్ ఆస్ట్రాజెనికా.. ఫైజర్లతో కూడా గత నవంబర్ లో ఎగ్రిమెంట్ చేసుకుంది. ఎంత ముందుచూపుతో ఇజ్రాయిల్ వ్యవహరించిందంటే.. 50 లక్షల వ్యాక్సిన్ డోసుల నిలువ ఉంచగలిగే సామ్సర్ధ్యం ఉన్న 30 భారీ రిఫ్రిజిరేటర్లను ఆయా దేశం తన ప్రధాన విమానాశ్రయం దగ్గర భూగర్భంలో ఏర్పాటు చేసుకుంది.

Also Read: New York: నా బిడ్డను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అనుమతి ఇవ్వండి.. కోర్టులో షాకింగ్ పిటిషన్!

బిట్ కాయిన్ ఆల్ టైం రికార్డ్, వాల్‌స్ట్రీట్‌లో క్రిప్టో క‌రెన్సీ ఎక్స్చేంజ్ కాయిన్ బేస్ త‌న షేర్లను ఆవిష్కరిస్తున్న వేళ అద్భుతం