AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీసాల నిలిపివేత యోచనలో అమెరికా !

అమెరికాలో రికార్డు స్థాయిలో నిరుద్యోగం పెరగడం, కరోనా విజృంభించడంతో హెచ్1బి వీసాలతో పాటు అన్ని రకాల ఎంప్లాయ్‌మెంట్‌ వీసాలపై వేటువేసే దిశగా ట్రంప్‌ సర్కార్‌ అడుగులు వేస్తోంది.

వీసాల నిలిపివేత యోచనలో అమెరికా !
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 13, 2020 | 7:00 AM

Share

అమెరికాలో రికార్డు స్థాయిలో నిరుద్యోగం పెరగడం, కరోనా విజృంభించడంతో హెచ్1బి వీసాలతో పాటు అన్ని రకాల ఎంప్లాయ్‌మెంట్‌ వీసాలపై వేటువేసే దిశగా ట్రంప్‌ సర్కార్‌ అడుగులు వేస్తోంది. అమెరికా ఆ నిర్ణయం తీసుకుంటే భారతీయ ఐటీ నిపులణులపై అధిక ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనా సంక్షోభంలో చిక్కుకున్న అమెరికాలో నిరుద్యోగం రికార్డు స్థాయికి చేరింది. ఈ ఏడాది నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో తమ పౌరులకు ఉపాధి అవకాశాలు పెంచే మార్గాలను అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ అన్వేషిస్తున్నారు. అందులో భాగంగా పలు రకాల ఉద్యోగ, ఉపాధి వీసాలను కొంతకాలం నిలిపివేసే ప్రత్యామ్నాయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.అక్టోబర్‌ 1 వరకు వీసాలను ట్రంప్‌ సస్పెండ్‌ చేసే అవకాశం ఉంది. హెచ్1బి వీసాలతో పాటు హెచ్1బి, జే-1, ఎల్-1 వీసాలను కూడా సస్పెండ్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. విదేశీయులకు ఉద్యోగాలను ఇచ్చే కంపెనీలపై చర్యలు తప్పవని ఇప్పటికే ట్రంప్‌ సర్కార్‌ స్పష్టం చేసింది. అమెరికాలో ఇప్పటికే హెచ్1బి వీసాలు కలిగి ఉన్నవాళ్లకు దీంతో ఇబ్బంది లేదు. కానీ విదేశాల్లో ఉన్న హెచ్1బి హోల్డర్లు మాత్రం అమెరికాలో అడుగుపెట్టేందుకు అవకాశాలను కోల్పోతారు. హెచ్1బి వీసాలు కలిగిన వాళ్లలో భారతీయులే ఎక్కువగా ఉన్నారు. భారత్‌తో పాటు చైనాకు చెందిన వాళ్లు ఎక్కువగా అమెరికా టెక్‌ కంపెనీల్లో పనిచేస్తున్నారు. చాలా మంది భారతీయులు కరోనా సంక్షోభం కారణంగా అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయారు. వాళ్లంతా స్వదేశానికి తిరిగి వచ్చారు. ట్రంప్‌ తాజా ఆలోచనతో వాళ్ల భవితవ్యం అయోమయంలో పడింది. అయితే ఎంప్లాయ్‌మెంట్‌ వీసాల సస్పెన్షన్‌పై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని వైట్‌హౌజ్‌ వర్గాలు స్పష్టం చేశాయి. అమెరికన్ల ఉద్యోగాలను కాపాడడానికి కొన్ని చర్యలు మాత్రం తప్పకుండా తీసుకుంటామని తెలిపాయి.

మటన్ చాప్స్‌తో ఇలా వండితే మీ ఇంట్లో పండగే!
మటన్ చాప్స్‌తో ఇలా వండితే మీ ఇంట్లో పండగే!
కళ్ళు మూసుకోడు.. నిద్రపోడు… 50 ఏళ్లుగా ఇదే జీవితం! డాక్టర్లే షాక్
కళ్ళు మూసుకోడు.. నిద్రపోడు… 50 ఏళ్లుగా ఇదే జీవితం! డాక్టర్లే షాక్
ఆ పాటకు యూట్యూబ్ నుంచి కోటి 80 లక్షలు వచ్చాయి.. సింగర్ రాము..
ఆ పాటకు యూట్యూబ్ నుంచి కోటి 80 లక్షలు వచ్చాయి.. సింగర్ రాము..
USA vs IND: అమెరికా టీం ప్లేయింగ్ 11లో అంతా మనోళ్లే
USA vs IND: అమెరికా టీం ప్లేయింగ్ 11లో అంతా మనోళ్లే
ఉదయం కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు వస్తున్నాయా? ఎందుకొస్తాయో తెలుసా
ఉదయం కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు వస్తున్నాయా? ఎందుకొస్తాయో తెలుసా
దక్షిణ కొరియాను ఫాలో అవుతున్న గ్రామం.. సిలిండర్ లేకుండానే వంట
దక్షిణ కొరియాను ఫాలో అవుతున్న గ్రామం.. సిలిండర్ లేకుండానే వంట
ఈ చిత్రంలో మీరు దేన్నైతే మొదట చూస్తారో అదే మీ వ్యక్తిత్వం
ఈ చిత్రంలో మీరు దేన్నైతే మొదట చూస్తారో అదే మీ వ్యక్తిత్వం
చపాతీ పిండిని ఫ్రిజ్‌లో పెడుతున్నారా..ఎప్పటి వరకు సేఫ్‌గా ఉంటుంది
చపాతీ పిండిని ఫ్రిజ్‌లో పెడుతున్నారా..ఎప్పటి వరకు సేఫ్‌గా ఉంటుంది
వదినపై అనుమానం.. సీఐడీని మించిన ప్లానింగ్.. చివరకు..
వదినపై అనుమానం.. సీఐడీని మించిన ప్లానింగ్.. చివరకు..
చికెన్, మటన్ తినేదెలా.. రేట్లు చూస్తే దిమాక్ ఖరాబే..
చికెన్, మటన్ తినేదెలా.. రేట్లు చూస్తే దిమాక్ ఖరాబే..