డేంజర్ బెల్స్.. ఆరు నెలల లాక్‌డౌన్‌కు సిద్ధంకండంటూ హెచ్చరికలు..!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి చుట్టేసిన విషయం తెలిసిందే. దాదాపు అన్ని దేశాలు దీని బారినపడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే 27వేల మందికి పైగా ఈ వైరస్ పొట్టనపెట్టుకుంది. ఆరు లక్షల మందికిపైగా వైరస్ సోకి.. ఆస్పత్రి పాలయ్యారు. అయితే చైనాలో పుట్టిన ఈ వైరస్.. బ్రిటన్, అమెరికాలను అతలాకుతలం చేస్తోంది. ముఖ్యంగా.. దీని ధాటికి బ్రిటన్‌లో ఇప్పటికే వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఏకంగా.. అక్కడి ప్రధాని బోరిస్ జాన్సన్, ప్రిన్స్ చార్ల్స్ కూడా […]

డేంజర్ బెల్స్.. ఆరు నెలల లాక్‌డౌన్‌కు సిద్ధంకండంటూ హెచ్చరికలు..!
Follow us

| Edited By:

Updated on: Mar 28, 2020 | 7:23 PM

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి చుట్టేసిన విషయం తెలిసిందే. దాదాపు అన్ని దేశాలు దీని బారినపడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే 27వేల మందికి పైగా ఈ వైరస్ పొట్టనపెట్టుకుంది. ఆరు లక్షల మందికిపైగా వైరస్ సోకి.. ఆస్పత్రి పాలయ్యారు.

అయితే చైనాలో పుట్టిన ఈ వైరస్.. బ్రిటన్, అమెరికాలను అతలాకుతలం చేస్తోంది. ముఖ్యంగా.. దీని ధాటికి బ్రిటన్‌లో ఇప్పటికే వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఏకంగా.. అక్కడి ప్రధాని బోరిస్ జాన్సన్, ప్రిన్స్ చార్ల్స్ కూడా ఈ కరోనా కాటుకు.. క్వారంటైన్‌కు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌ను అదుపు చేసేందుకు.. బ్రిటన్ అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం బ్రిటన్ మొత్తం కఠిన ఆంక్షలతో కూడిన లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. అయితే ఈ లాక్‌డౌన్‌ను మరి కొంత కాలం పొడిగించే దిశగా చర్చలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో బ్రిటన్ డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ జెన్నీ హ్యారిస్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రిటన్‌ వ్యాప్తంగా ప్రస్తుతం కొనసాగిస్తున్న లాక్‌డౌన్‌ను మరో ఆరు మాసాల పాటు పొడిగించే అవకాశం ఉందని.. ఇందుకు ప్రజలంతా సిద్ధంగా ఉండాలన్నారు.అయితే లాక్‌డౌన్ విధించినప్పటికీ.. క్రమంగా ఆంక్షలను ఎత్తివేస్తామని.. వైరస్ వ్యాప్తి వేగం నెమ్మదిస్తోందన్నారు.