యూకేలో కరోనా విలయ తాండవం.. 44 వేలకు చేరిన మరణాల సంఖ్య

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలన్నింటికి గజగజ వణికిస్తోంది. దీనికి ఇప్పటి వరకు వ్యాక్సిన్‌ లేకపోవడంతో పాటు.. సరైన వైద్య విధానం, మందులు లేకపోవడంతో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. రోజుకు..

యూకేలో కరోనా విలయ తాండవం.. 44 వేలకు చేరిన మరణాల సంఖ్య
Follow us

| Edited By:

Updated on: Jul 09, 2020 | 1:46 PM

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలన్నింటికి గజగజ వణికిస్తోంది. దీనికి ఇప్పటి వరకు వ్యాక్సిన్‌ లేకపోవడంతో పాటు.. సరైన వైద్య విధానం, మందులు లేకపోవడంతో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. రోజుకు లక్షల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే కోటి మార్క్‌ను దాటేసింది. మరణాలు కూడా లక్షల్లో నమోదవుతున్నాయి. తాజాగా యూకే కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి 126 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు యూకేలో కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 44,517కి చేరింది. అంతకుముందు రోజు కరోనా బారినపడి 155 మంది మరణించారని.. యూకే ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు. ఇక కొత్తగా 63 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని.. దీంతో ఇప్పటి వరకు యూకేలో కరోనా పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య 2,86,979కి చేరింది.

Latest Articles