గ్రామ వాలంటీర్ చేసిన తప్పు.. రెండు వర్గాల మధ్య కొట్లాట..

గ్రామ వాలంటీర్ చేసిన తప్పు.. రెండు వర్గాల మధ్య కొట్లాట..

ఓ గ్రామ వాలంటీర్ చేసిన అతి తెలివి పనికి రెండు వర్గాల వారు కొట్లాటకు దిగారు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కురిచేడు మండలం ఆవులమంద గ్రామంలో ఇతర రాష్ట్రాలకు వెళ్లి చిక్కుకుపోయిన వలస కూలీలు ఇటీవలే తిరిగి వచ్చారు. అందులో రెండు వర్గాల వారు ఉన్నారు. సాధారణంగా వలస కూలీలు ఎవరైనా వారి స్వస్థలాలకు చేరుకుంటే.. వారి సమాచారాన్ని ప్రభుత్వానికి అందించే పని గ్రామ వాలంటీర్లు చేస్తారు. ఈ క్రమంలోనే […]

Ravi Kiran

|

May 04, 2020 | 2:25 PM

ఓ గ్రామ వాలంటీర్ చేసిన అతి తెలివి పనికి రెండు వర్గాల వారు కొట్లాటకు దిగారు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కురిచేడు మండలం ఆవులమంద గ్రామంలో ఇతర రాష్ట్రాలకు వెళ్లి చిక్కుకుపోయిన వలస కూలీలు ఇటీవలే తిరిగి వచ్చారు. అందులో రెండు వర్గాల వారు ఉన్నారు.

సాధారణంగా వలస కూలీలు ఎవరైనా వారి స్వస్థలాలకు చేరుకుంటే.. వారి సమాచారాన్ని ప్రభుత్వానికి అందించే పని గ్రామ వాలంటీర్లు చేస్తారు. ఈ క్రమంలోనే ఓ గ్రామ వాలంటీర్ తన అతి తెలివి ఉపయోగించి తిరిగి వచ్చిన వారిలో ఒక వర్గం వారి వివరాలు మాత్రమే అధికారులకు అందజేశాడు. దీనితో మరో వర్గం వారు తమ వివరాలను ఎందుకు చెప్పలేదంటూ వాలంటీర్‌తో వాగ్వాదానికి దిగారు. అటు నుంచి మరో వర్గం వాలంటీర్‌కు మద్దతుగా నిలిచి ఘర్షణకు దిగారు. ఇలా రెండు వర్గాల వారు తీవ్రస్థాయిలో గొడవ పడ్డారు. ఈ దాడిలో ముగ్గురుకు గాయాలు కూడా అయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Read More: 

తెలంగాణలో మే 21 వరకు లాక్‌డౌన్‌..?

జగన్ సర్కార్ సంచలనం.. ఇకపై ఇంటర్ ఉంటేనే ప్రభుత్వ ఉద్యోగం..

నేటి నుంచి ఏపీలో మద్యం షాపులు ఓపెన్.. టైమింగ్స్ ఇవే..

మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. అంతలోనే బ్యాడ్ న్యూస్..

కరోనా బాధితులకు అయ్యే ఖర్చు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

వారిని మాత్రమే తరలించాలి.. కేంద్రం క్లారిటీ..

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ 3.0.. తెరుచుకునేవి ఇవే..

‘కరోనా’ జంతువును మన దేశంలోనూ తింటారట.. ఎక్కడో తెలుసా.!

మహారాష్ట్రలో కరోనా విజృంభణ.. దేశంలో కరోనా కేసులు ఎన్నంటే…

ఇదెక్కడి విచిత్రం.. మద్యం షాపుకు కొబ్బరికాయ కొట్టి పూజలు..

గ్రీన్ జోన్లలో బస్సులు నడవవు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu