కరోనా బాధితులకు అయ్యే ఖర్చు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

కరోనా వైరస్ పాజిటివ్ అని నిర్ధారణ అయితే చాలు.. ఇంటి నుంచి సదరు వ్యక్తిని ఆసుపత్రికి తీసుకొచ్చి వైద్యం అందిస్తారు. అనారోగ్యంతో హాస్పిటల్‌కు వచ్చి మళ్ళీ అతడు సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఇంటికి చేరేంతవరకు ప్రభుత్వమే ఖర్చు భరిస్తుంది. బాధితుడు ఆసుపత్రిలో చేరుకున్న దగ్గర నుంచి వసతి, భోజనం, మందులు, చికిత్స.. ఇలా మొత్తం అయ్యే ఖర్చు ఎంతో అన్న విషయం బయటపడింది. ఇక కరోనా సోకిన వారు కోలుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా భారీగా ఖర్చు […]

కరోనా బాధితులకు అయ్యే ఖర్చు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
Follow us

|

Updated on: May 04, 2020 | 2:14 PM

కరోనా వైరస్ పాజిటివ్ అని నిర్ధారణ అయితే చాలు.. ఇంటి నుంచి సదరు వ్యక్తిని ఆసుపత్రికి తీసుకొచ్చి వైద్యం అందిస్తారు. అనారోగ్యంతో హాస్పిటల్‌కు వచ్చి మళ్ళీ అతడు సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఇంటికి చేరేంతవరకు ప్రభుత్వమే ఖర్చు భరిస్తుంది. బాధితుడు ఆసుపత్రిలో చేరుకున్న దగ్గర నుంచి వసతి, భోజనం, మందులు, చికిత్స.. ఇలా మొత్తం అయ్యే ఖర్చు ఎంతో అన్న విషయం బయటపడింది. ఇక కరోనా సోకిన వారు కోలుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా భారీగా ఖర్చు చేస్తున్నాయి.

వైరస్ నిర్ధారణ పరీక్ష దగ్గర నుంచి బాధితుడు ఆరోగ్యవంతంగా ఇంటికి చేరుకునే వరకు ఒక్కో వ్యక్తిపై రూ. 3.5 లక్షల వరకు ఖర్చవుతున్నట్లు సమాచారం. తొలి కరోనా పరీక్షకు రూ. 4500 అవుతుంది. ఆ పరీక్షలో కరోనా తేలితే వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తారు. ఇక దీని తర్వాత మరో రెండుసార్లు కరోనా టెస్టులు చేస్తారు. ఇలా ఒక్కొక్కరి మూడు పరీక్షలకు గానూ రూ.13500 ఖర్చవుతుంది. ఇక అనుమానితుల విషయానికి వస్తే.. వారికి పరీక్షలు నిర్వహించడానికి అంబులెన్స్‌లోనే ఆసుపత్రికి తీసుకొస్తున్నారు. అనంతరం డిశ్చార్జ్ చేసిన వ్యక్తిని మళ్లీ ప్రభుత్వ వాహనంలోనే తిరిగి పంపిస్తారు. దీని బట్టి రోగికి రూ.4 వేలకు పైగా రవాణా ఖర్చు అవుతోందని అంచనా.

అటు పాజిటివ్ వచ్చిన వారికి చికిత్స పూర్తయ్యేవరకు దాదాపు 80 పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ (పీపీఈ) కిట్లను వినియోగిస్తారు. ఇక ఒక్కొక్క కిట్ ధర రూ.2500కు పైగా. దీంతో ఈ కిట్లకు సుమారు రూ.2 లక్షలు ఖర్చు అవుతోంది. వైరస్ ప్రభావం ఎక్కువ ఉన్నవారికి అయితే మరింత అధికంగా ఖర్చవుతుందని తెలుస్తోంది. ఇక కరోనా నుంచి కోలుకోవడానికి బాధితులకు మందులు ఇస్తారు.. ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంచేందుకు యాంటీ బయాటిక్ మందులు, ఫ్లూయిడ్స్ అందజేస్తారు.. వీటికి రూ.50 వేలకు పైగా ఖర్చవుతోంది.

మరోవైపు కరోనా నుంచి త్వరగా కోలుకునేందుకు రోగికి పౌష్టికాహారం అందిస్తారు. అల్పాహారం, భోజనం, డ్రైఫ్రూట్స్, పాలు, బ్రెడ్, వాటర్ బాటిల్స్‌.. వీటన్నింటికి అయ్యే ఖర్చు రూ.55 వేలు అని అంచనా. అటు రోగి కోసం ప్రత్యేకంగా సబ్బులు, శానిటైజర్, డ్రెస్‌ల కోసం మరో రూ.27 వేలు ఖర్చవుతోంది. కాగా, ప్రభుత్వాలు ఖర్చు గురించి పట్టించుకోకపోవడంతో ఆసుపత్రి వర్గాలు కరోనా బాధితులను కంటికి రెప్పలా చూసుకుంటూ వైద్యం అందిస్తున్నారు.

Read More: 

తెలంగాణలో మే 21 వరకు లాక్‌డౌన్‌..?

జగన్ సర్కార్ సంచలనం.. ఇకపై ఇంటర్ ఉంటేనే ప్రభుత్వ ఉద్యోగం..

నేటి నుంచి ఏపీలో మద్యం షాపులు ఓపెన్.. టైమింగ్స్ ఇవే..

మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. అంతలోనే బ్యాడ్ న్యూస్..

వారిని మాత్రమే తరలించాలి.. కేంద్రం క్లారిటీ..

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ 3.0.. తెరుచుకునేవి ఇవే..

‘కరోనా’ జంతువును మన దేశంలోనూ తింటారట.. ఎక్కడో తెలుసా.!

మహారాష్ట్రలో కరోనా విజృంభణ.. దేశంలో కరోనా కేసులు ఎన్నంటే…

ఇదెక్కడి విచిత్రం.. మద్యం షాపుకు కొబ్బరికాయ కొట్టి పూజలు..

గ్రీన్ జోన్లలో బస్సులు నడవవు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్