AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సాదాసీదాగా ల‌ష్క‌ర్ బోనాలు.. ఉజ్జ‌యినీ అమ్మ‌వారికి తొలి బోనం స‌మ‌ర్పణ‌..

తెలంగాణ రాష్ట్రంలో బోనాల సంద‌డి మొద‌లైంది. ఇవాళ‌ సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జ‌యిని మ‌హంకాళి అమ్మ‌వారికి, తెలంగాణ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ స‌తీమ‌ణి తొలి బోనం స‌మ‌ర్పించారు. ఇవాళ ఉద‌యం తెల్ల‌వారు జామున‌ ఆల‌యం బ‌య‌ట‌ పండితులకు తొలి బోనం అంద‌జేశారు తలసాని భార్య‌ స్వర్ణ. ప్ర‌తీ ఏడాది మంత్రి శ్రీనివాస్ యాదవ్ నివాసం నుండే..

సాదాసీదాగా ల‌ష్క‌ర్ బోనాలు.. ఉజ్జ‌యినీ అమ్మ‌వారికి తొలి బోనం స‌మ‌ర్పణ‌..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 12, 2020 | 9:27 AM

Share

తెలంగాణ రాష్ట్రంలో బోనాల సంద‌డి మొద‌లైంది. ఇవాళ‌ సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జ‌యిని మ‌హంకాళి అమ్మ‌వారికి, తెలంగాణ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ స‌తీమ‌ణి తొలి బోనం స‌మ‌ర్పించారు. ఇవాళ ఉద‌యం తెల్ల‌వారు జామున‌ ఆల‌యం బ‌య‌ట‌ పండితులకు తొలి బోనం అంద‌జేశారు తలసాని భార్య‌ స్వర్ణ. ప్ర‌తీ ఏడాది మంత్రి శ్రీనివాస్ యాదవ్ నివాసం నుండే అమ్మ వారికి తొలి బోనం సమర్పించడం ఆనవాయితీ. అలాగే ఈ ఏడాది కూడా సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జ‌యిని మ‌హంకాళి అమ్మ‌వారికి తొలి బోనం స‌మ‌ర్పించారు. కాగా క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఈ ఏడాది బోనాలు పూర్తిగా నిబంధ‌న‌ల‌తో జ‌రుగుతున్నాయి. ఈ సంవ‌త్స‌రం బోనాల జాత‌ర‌కు బ్రేక్ ప‌డింది. బోనాలు స‌ర్పించే భ‌క్తులు వారి ఇళ్ల‌ల్లో వారే బోనం చేసి స‌మ‌ర్పించుకోవాల‌ని తెలంగాణ మంత్రి త‌ల‌సాని పేర్కొన్న విష‌యం తెలిసిందే.

శుక్ర‌వారం నుంచే ఉజ్జ‌యినీ మ‌హంకాళీ ఆల‌యంలో ద‌ర్శ‌నాల‌ను అధికారులు నిలిపివేశారు. నేడు అమ్మ‌వారికి బంగారు బోనం, ప్ర‌భుత్వం త‌ర‌పున ప‌ట్టువ‌స్త్రాల్ని స‌మ‌ర్పించారు. కాగా 13వ తేదీన రంగం ఉంటుంది. కాగా ఉత్స‌వాల్ని ప్ర‌జ‌లంతా చూసేలా ఆల‌యం నుంచి ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తున్నారు. ఉద‌యం 4 గంట‌ల నుంచే ఈ లైవ్ ప్ర‌సారం అవుతుంది. భ‌క్తులు బోనం స‌ర్పించ‌డంతో పాటు, ద‌ర్శ‌నాల‌కు అనుమ‌తులు లేవు.

కాగా రాష్ట్రంలో శనివారం కొత్తగా 1,178 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఒక్కరోజే 1,714 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. కరోనాతో ఇవాళ తొమ్మిది మంది మృతిచెందారు. ఒక్క హైదరాబాద్‌లోనే 736 మందికి కొవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తెలంగాణలో మొత్తం పాజిటవ్‌ కేసుల సంఖ్య 33,402కు చేరింది. కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 348కి పెరిగింది. రాష్ట్రంలో 12,135 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి కొలుకొని 20,919 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

Read More:

తెలుగు రాష్ట్రాల్లో టెర్ర‌ర్ సృష్టిస్తోన్న కరోనా.. తీవ్రంగా కేసులు న‌మోదు..

ప్ర‌ముఖ న‌టి రేఖ బంగ్లాకి సీల్..

Follow Us