కరోనా దృష్ట్యా.. కీలక నిర్ణయం తీసుకున్న హైకోర్టు
కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ హైకోర్టు. ఈ నెల 15వ తేదీ నుంచి జిల్లా కోర్టులు తెరవాలన్న నిర్ణయాన్ని హైకోర్టు వెనక్కి తీసుకుంది. ఈ నెలాఖరు వరకూ జిల్లా కోర్టులు, ట్రైబ్యునళ్లు లాక్‌డౌన్ కొనసాగించాలని...

కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ హైకోర్టు. ఈ నెల 15వ తేదీ నుంచి జిల్లా కోర్టులు తెరవాలన్న నిర్ణయాన్ని హైకోర్టు వెనక్కి తీసుకుంది. ఈ నెలాఖరు వరకూ జిల్లా కోర్టులు, ట్రైబ్యునళ్లు లాక్‌డౌన్ కొనసాగించాలని నిర్ణయించింది. కరోనా తీవ్రత దృష్ట్యా నిర్ణయాన్ని ఉన్నత ధర్మాసనం పున: సమీక్షించింది. హైకోర్టు నిర్ణయానికి న్యాయ వాదులు సహకరించాలని.. ఏజీ ప్రసాద్ కోరారు.
కాగా ప్రస్తుతం తెలంగాణలో.. కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా శుక్రవారం నాడు కొత్తగా మరో 164 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4484కి చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి 9 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 174కి చేరింది. ఇక శుక్రవారం నమోదైన కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే అత్యధికంగా నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం 133 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇక ఇప్పటి వరకు కరోనా వైరస్ నుంచి కోలుకుని 2278 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని.. ప్రస్తుతం 2032 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బులిటెన్‌లో వెల్లడించింది.
Read More:
అసభ్యంగా ప్రవర్తించాడని.. కొడుకుపైనే కేసు పెట్టిన నటి
భక్తులకు గుడ్‌న్యూస్.. శ్రీకాళహస్తిలో దర్శనాలకు గ్రీన్ సిగ్నల్..



