టెస్టింగ్ లేబోరేటరీ సిబ్బందికీ కరోనా !

కరోనా వైరస్ దేశంపై పంజా విసురుతోంది. లాక్ డౌన్ సడలింపుల తర్వాత మరింత విజృంభిస్తోంది. తాజాగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న ల్యాబుల్లో 70శాతం మందికి కరోనా పాజిటివ్ రావడం ఆందోళన కలిగిస్తోంది.

టెస్టింగ్ లేబోరేటరీ సిబ్బందికీ కరోనా !
Follow us

| Edited By:

Updated on: Jun 13, 2020 | 10:26 PM

కరోనా వైరస్ దేశంపై పంజా విసురుతోంది. లాక్ డౌన్ సడలింపుల తర్వాత మరింత విజృంభిస్తోంది. కరోనా మహమ్మారిపై పోరాటం ముందు వరుసలో ఉండి పని చేస్తున్న వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది, జర్నలిస్టులు పెద్ద ఎత్తున కరోనాబారినపడుతున్నారు. తాజాగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న ల్యాబుల్లో 70శాతం మందికి కరోనా పాజిటివ్ రావడం ఆందోళన కలిగిస్తోంది. దేశరాజధాని ఢిల్లీ సమీపంలో గల ఈఎస్‌ఐ ఆస్పత్రిలోని పాథోలాజికల్ టెస్ట్ లాబోరేటరీని మూసివేశారు. ఈ ల్యాబులో పనిచేసే 70శాతం మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో హడలిపోయారు. దీంతో కరోనా అనుమానంతో ఆస్పత్రికి వచ్చే వారి నుంచి పరీక్షల కోసం శాంపిళ్లను సేకరించడాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ఇప్పటికే సేకరించిన శాంపిళ్లను మరో చోట పరీక్షలకు పంపుతున్నారు. కొత్త సిబ్బందిని నియమించే వరకూ ఆస్పత్రిలో కరోనా పరీక్షలు నిర్వహించబోమని లాబోరేటరీ వైద్యులు తెలిపారు. బాధితులకు వైద్యం అందించే డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా పలువురు కరోనా బారినపడుతూనే ఉన్నారు. కొన్నిచోట్ల వైద్యులు ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు కూడా ఉన్నాయి.