AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాటల్లేవ్.. మాట్లాడుకోవడల్లేవ్.. ఇక తెగతెంపులే..

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో చైనా తప్పుడు లెక్కలు చెబుతోందని.. అది ల్యాబ్‌లోనే సృష్టించబడినది అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలుమార్లు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఆయన మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మాట్లాడటానికి తనకు ఆసక్తి లేదని మండిపడ్డారు. ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనాతో సత్ససంబంధాలు తెంచుకునే యోచనలో ఉన్నట్లు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. […]

మాటల్లేవ్.. మాట్లాడుకోవడల్లేవ్.. ఇక తెగతెంపులే..
Ravi Kiran
|

Updated on: May 15, 2020 | 5:59 PM

Share

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో చైనా తప్పుడు లెక్కలు చెబుతోందని.. అది ల్యాబ్‌లోనే సృష్టించబడినది అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలుమార్లు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఆయన మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మాట్లాడటానికి తనకు ఆసక్తి లేదని మండిపడ్డారు. ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనాతో సత్ససంబంధాలు తెంచుకునే యోచనలో ఉన్నట్లు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫాక్స్ బిజినెస్ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పైవిధంగా కామెంట్స్ చేశారు.

Watch Live: లాక్ డౌన్ అమలుపై కేసీఆర్ కీలక నిర్ణయం

కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో చైనా వ్యవహరించిన తీరు చాలా నిరాశకు గురి చేసిందని ఆయన అన్నారు. ఇప్పటివరకు చైనాతో మంచి వ్యాపార సంబంధాలు కొనసాగాయని.. భవిష్యత్తులో మాత్రం అలా ఉండకపోవచ్చునని ట్రంప్ తెలిపారు. కరోనా మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు చైనా సరైన చర్యలు చేపట్టి ఉంటే వైరస్ వ్యాప్తి కంట్రోల్ అయ్యేదని.. కానీ అలా జరగలేదని.. ప్రపంచం మొత్తం ఇప్పుడు విపత్కర పరిస్థితులను ఎదుర్కుంటోందని ఆయన అన్నారు. కాగా, చైనాపై తీవ్రంగా మండిపడుతున్న ట్రంప్.. అక్కడ ఈక్వీటీ మార్కెట్లలో పెట్టాలనుకున్న పెట్టుబడులను ఉపసంహరించుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Read This: కిమ్ మరో సంచలనం.. ఈసారి వారిపై రహస్య నిఘా!