కరోనాను జయించబోతున్నాం.. మెడిసిన్ దొరికేసిందటూ ట్రంప్ ట్వీట్..!

ప్రపంచం మొత్తాన్ని గజగజ వణికిస్తోన్న కరోనాకు మెడిసిన్‌ను కనుగునే పనిలో శాస్త్రవేత్తలు తలమునగలై ఉన్నారు. వీలైనంత త్వరగా ఈ మహమ్మారి ఆట కట్టించాలని వారందరూ కంకణం కట్టుకున్నారు.

కరోనాను జయించబోతున్నాం.. మెడిసిన్ దొరికేసిందటూ ట్రంప్ ట్వీట్..!

Edited By:

Updated on: Mar 22, 2020 | 12:01 PM

ప్రపంచం మొత్తాన్ని గజగజ వణికిస్తోన్న కరోనాకు మెడిసిన్‌ను కనుగునే పనిలో శాస్త్రవేత్తలు తలమునగలై ఉన్నారు. వీలైనంత త్వరగా ఈ మహమ్మారి ఆట కట్టించాలని వారందరూ కంకణం కట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కరోనా మెడిసిన్‌పై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌ ఓ ట్వీట్ వేశారు.

”హైడ్రోగ్జైక్లోరోయిన్, అజిత్రోమైసిన్.. ఈ రెండు ఔషదాల మిశ్రమాలతో ఔషద చరిత్రలోనే ఓ కొత్త అధ్యయనం మొదలుకాబోతోంది. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ దీనిపై అధ్యయనం చేస్తోంది. అవి రెండు ఔషదాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. అజిత్రోమైసిన్‌ కంటే హైడ్రోగ్జైక్లోరోయిన్ బాగా పనిచేస్తుందని యాంటిమైక్రోబియల్ ఏజెంట్లు కూడా చెబుతున్నారు. వీలైనంత త్వరగా ఈ ఔషదాన్ని అందుబాటులోకి తీసుకొస్తారని భావిస్తున్నా. ప్రజలందరూ చచ్చిపోతున్నారు. త్వరగా కదలండి. ప్రతి ఒక్కరినీ దేవుడు కాపాడుతాడని నమ్ముతున్నా” అని ట్రంప్ ట్వీట్ చేశారు. కాగా కరోనాతో ప్రపంచవ్యాప్తంగా 13వేల మందికి పైగా మృత్యువాడ పడ్డారు. బాధితుల సంఖ్య 3లక్షలు దాటింది.

Read This Story Also: జనతా కర్ఫ్యూ.. చిన్న తప్పు.. రజనీకి ట్విట్టర్ షాక్..!