జనతా కర్ఫ్యూ.. చిన్న తప్పు.. రజనీకి ట్విట్టర్ షాక్..!

భారత్‌లో కరోనా విస్తరణకు అడ్డుకట్ట వేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇక ఆయన పిలుపుకు సినీ సెలబ్రిటీల నుంచి కూడా మద్దతు లభించింది.

జనతా కర్ఫ్యూ.. చిన్న తప్పు.. రజనీకి ట్విట్టర్ షాక్..!
Follow us

| Edited By:

Updated on: Mar 22, 2020 | 11:08 AM

భారత్‌లో కరోనా విస్తరణకు అడ్డుకట్ట వేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇక ఆయన పిలుపుకు సినీ సెలబ్రిటీల నుంచి కూడా మద్దతు లభించింది. బాలీవుడ్‌తో పాటు దక్షిణాది ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు జనతా కర్ప్యూకు తమ మద్దతును తెలిపారు. ఈ నేపథ్యంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ జనతా కర్ఫ్యూకు మద్దతు తెలుపుతూ.. కరోనాపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతూ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. అయితే ఆ వీడియోను ట్విట్టర్ సంస్థ తొలగించింది. ట్విట్టర్ నియమ నిబంధనలను ఈ వీడియో అతిక్రమించిన కారణంగా తొలగించినట్లు పేర్కొంది.

అయితే ఆ వీడియోలో రజనీకాంత్ పెద్దగా తప్పులు ఏమీ చెప్పలేదు. కరోనా వైరస్ లైఫ్‌టైమ్‌ 12 గంటలు కాగా.. సూపర్‌స్టార్ దాన్ని 14 గంటలుగా చెప్పారు. ఇది ప్రజలకు తప్పుదోవ పట్టించినట్లుగా ఉందని భావించిన ట్విట్టర్ ఆ వీడియోను తొలగించింది. అదొక్కటి తప్ప మిగిలిన ఎక్కడా ఆయన చిన్న తప్పు కూడా చెప్పలేదు. కాగా ఈ వీడియోను ట్విట్టర్ తొలగించడంపై ఆయన అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆ వీడియోలో కరోనా వ్యాప్తిని అరికట్టాలని తెలిపిన రజనీ.. దేశ ప్రజలందరూ కర్ఫ్యూకు సహకరించాలని కోరారు. కరోనా నియంత్రన కోసం ప్రాణాలను లెక్క చేయకుండా వైద్య సేవలు చేస్తున్న అధికారులు, డాక్టర్లు, నర్సులను అభినందిస్తూ ప్రధాని చెప్పినట్లుగా ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఇంటి తలపులు, కిటికీల వద్దకు వచ్చి చప్పట్లు, గంటలు కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

Read This Story Also: గుడ్‌న్యూస్‌.. ఏపీలో కోలుకున్న తొలి కరోనా బాధితుడు..!