Covid19 vaccine: వ్యాక్సినేషన్ ప్రక్రియలో మరో మైలురాయి.. 18 కోట్లు దాటిన టీకాల పంపిణీ

|

May 15, 2021 | 11:18 AM

ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సినేష‌న్ ప్రక్రియ భారతదేశంలో కొన‌సాగుతోంది. ఈఏడాది జ‌న‌వ‌రి 16న ప్రారంభ‌మైన టీకా పంపిణీ మ‌రో మైలురాయిని అధిగ‌మించింది.

Covid19 vaccine: వ్యాక్సినేషన్ ప్రక్రియలో మరో మైలురాయి.. 18 కోట్లు దాటిన టీకాల పంపిణీ
Covid19 Vaccine
Follow us on

COVID vaccination in India: ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సినేష‌న్ ప్రక్రియ భారతదేశంలో కొన‌సాగుతోంది. ఈఏడాది జ‌న‌వ‌రి 16న ప్రారంభ‌మైన టీకా పంపిణీ మ‌రో మైలురాయిని అధిగ‌మించింది. దేశంలో ఇప్పటివ‌ర‌కు 18 కోట్ల మందికిపైగా మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. కేంద్ర కుటుంబ సంక్షేమ‌, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుద‌ల చేసిన నివేదిక ప్రకారం ఇప్పటివరకు దేశ‌వ్యాప్తంగా 18,04,57,579మంది టీకా వేసుకున్నారు. ఇందులో 96,27,199 మంది ఆరోగ్య కార్యక‌ర్తలు మొద‌టి డోసు తీసుకున్నార‌ని, మ‌రో 66,21,675 మంది రెండో డోసు వేయించుకున్నార‌ని తెలిపింది.
అదేవిధంగా ఫ్రంట్‌లైన్ వ‌ర్కర్లు 1,43,63,754 మంది మొద‌టి డోసు, 81,48,757 మంది రెండో డోసు తీసుకున్నారని, 18 నుంచి 44 ఏండ్ల వ‌య‌స్సువారు.. 42,55,362 మొద‌టి డోసు తీసుకోగా, 5,67,99,389 మంది 45 నుంచి 60 ఏండ్లు పైబ‌డిన‌వారు మొద‌టి డోసు 87,50,224 రెండో డోసు తీసుకున్నార‌ని తెలిపింది. ఇక 5,43,15,317 మంది 60 ఏండ్లు పైబ‌డిన‌వారు మొద‌టి డోసు, 1,75,47,584 మంది రెండో డోసు వేయించుకున్నార‌ని వెల్లడించింది.

ఇక, 119వ రోజైన శుక్రవారం.. 11,03,625 మందికి టీకా పంపిణీ చేశామ‌ని పేర్కొంది. ఇందులో 6,29,445 మంది తొలి డోసు 4,74,180 మంది రెండో డోసు తీసుకున్నార‌ని తెలిపింది. నిన్న ఒక్కరోజే 18 నుంచి 44 ఏండ్ల లోపువారు 3,25,071 మంది వ్యాక్సిన్ తీసుకున్నార‌ని, దీంతో మొత్తం 42,55,362 మంది టీకా పొందార‌ని వెల్లడించింది.

Read Also… Covid19: దేశవ్యాప్తంగా కాస్త తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. ఏమాత్రం తగ్గని మరణాల సంఖ్య