నా జీవితంలో నేను చేసిన పెద్ద సాహాసం అదే..

TV9 Telugu Digital Desk

TV9 Telugu Digital Desk | Edited By:

Updated on: Aug 02, 2020 | 1:32 PM

'అరుంధ‌తి, బాహుబ‌లి, భాగ‌మ‌తి, రుద్ర‌మ‌దేవి' వంటి ప‌లు ప్రాధాన్య పాత్ర‌ల్లో న‌టించి ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను గెలుచుకుంది స్వీటి అలియాస్ అనుష్క‌. తాజాగా తను సినీకెరీర్ చేసిన పెద్ద సాహ‌సం గురించి ప్ర‌స్తావించింది ఈ ముద్దుగుమ్మ‌. ఆమె మాట్లాడుతూ.. ''అరుంధ‌తి, బాహుబ‌లి, భాగ‌మ‌తి, రుద్ర‌మ‌దేవి లాంటి ప్రాధాన్య చిత్రాల కోసం..

నా జీవితంలో నేను చేసిన పెద్ద సాహాసం అదే..

‘అరుంధ‌తి, బాహుబ‌లి, భాగ‌మ‌తి, రుద్ర‌మ‌దేవి’ వంటి ప‌లు ప్రాధాన్య పాత్ర‌ల్లో న‌టించి ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను గెలుచుకుంది స్వీటి అలియాస్ అనుష్క‌. తాజాగా తను సినీకెరీర్ చేసిన పెద్ద సాహ‌సం గురించి ప్ర‌స్తావించింది ఈ ముద్దుగుమ్మ‌. ఆమె మాట్లాడుతూ.. ”అరుంధ‌తి, బాహుబ‌లి, భాగ‌మ‌తి, రుద్ర‌మ‌దేవి లాంటి ప్రాధాన్య చిత్రాల కోసం.. నేను క‌త్తి యుద్ధాలు నేర్చుకున్నా.. గుర్ర‌పు స్వారీలు చేశా.. ఇవ‌న్నీ నాకు గొప్ప సాహ‌సాలే’. కానీ నేను జీవితంలో చేసిన అతి పెద్ద సాహ‌స‌మేంటంటే ‘బిల్లా’.. చిత్రాన్నే గుర్తు చేసుకుంటాన‌ని చెప్పింది.

బిల్లా సినిమాలో నేను చాలా ఎత్తు నుంచి దూకే స‌న్నివేశం ఒక‌టి ఉంది. ఫ‌స్ట్ నాకు డైరెక్ట‌ర్ ఆ స‌న్నివేశం గురించి చెప్పిన‌ప్పుడు.. ఏదోలా చేసేద్దాంలే అనుకున్నా. కానీ షాట్ పూర్త‌వ్వ‌గానే నాకు క‌ళ్లు తిరిగినంత పైనంది. ఎందుకంటే నాకు చిన్న‌ప్ప‌టి నుంచి ఎత్తైన ప్ర‌దేశాలంటే చాలా భ‌యం. కానీ ఆ భ‌యాన్ని ఏదోలా.. ఎప్పుడో ఒక‌ప్పుడు వ‌దిలించుకోక త‌ప్ప‌దు. అందుకే బిల్లాలోని ఆ సీన్ కోసం ప్ర‌య‌త్నించా. కానీ అది బెడిసి కొట్టింది. అందుకే మ‌ళ్లీ ఈ త‌ర‌హా సాహ‌మెప్పుడూ చేయ‌లేదు.

కాగా ప్ర‌స్తుతం అనుష్క’ నిశ్శ‌బ్దం’ చిత్రంలో న‌టిస్తోంది. ఇక ఈ సినిమాలో అనుష్క పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయట. ఈ సినిమాలో అనుష్క ‘ఆర్ట్ లవర్’ గా కనిపించనుంది. మాధవన్ ఈ చిత్రంలో సెల్లో ప్లేయర్ గా నటిస్తున్నాడు. ఇంకా ఇందులో అంజ‌లి, షాలినీ పాండే, సుబ్బ‌రాజు, అవ‌స‌రాల శ్రీనివాస్‌లు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఈసినిమా రిలీజ్ ఆగిపోయింది. అయితే ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తార‌ని ప‌లువార్త‌లు వస్తున్నాయి.

Read More:

‘క్యాస్టింగ్ కౌచ్’‌పై న‌టి ప్ర‌గ‌తి సంచ‌ల‌న కామెంట్స్..

సీఎం జ‌గ‌న్‌కు చెన్నైవాసి అరుదైన కానుక‌.. బంగారు, వెండితో మ‌సీదు!

 ‘ఆత్మ నిర్భ‌ర్ భార‌త్ లోగో’ త‌యారు చేయండి.. రూ.25 వేలు గెలుపొందండి!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu