ఇంట్లో ఉంటే కరోనా రాదనుకుంటే పొరపాటే.. సూచనలు ఇవే!

ఇంట్లో ఉన్నాము కదా.. కరోనా వైరస్ రాదనుకుంటే నిజంగా అది మన పొరపాటే. ఇంకా చెప్పాలంటే.. బయటివాళ్లకంటే.. ఇంట్లో ఉన్నవారికే వైరస్ ఎక్కువగా సోకే ప్రమాదం ఉంది. సరైన జాగ్రత్తలు పాటించకుంటే కుటుంబం మొత్తం ఈ వైరస్ బారిన..

ఇంట్లో ఉంటే కరోనా రాదనుకుంటే పొరపాటే.. సూచనలు ఇవే!


ఇంట్లో ఉన్నాము కదా.. కరోనా వైరస్ రాదనుకుంటే నిజంగా అది మన పొరపాటే. ఇంకా చెప్పాలంటే.. బయటివాళ్లకంటే.. ఇంట్లో ఉన్నవారికే వైరస్ ఎక్కువగా సోకే ప్రమాదం ఉంది. సరైన జాగ్రత్తలు పాటించకుంటే కుటుంబం మొత్తం ఈ వైరస్ బారిన పడే ఛాన్స్ ఉంది. స్వీయ నిర్భంద కాలంలో మీరు పాటించాల్సిన సూచనలేంటో మీరే తెలుసుకోండి.

నాలుగు గోడల మధ్య ఉన్నాము కదా.. ఎలాంటి వైరస్ దరి చేరదనుకుంటే పొరపాటే. పాల ప్యాకెట్లు, న్యూస్ పేపర్, ఇతరత్రా సరుకుల ద్వారా కూడా వైరస్ మనకు సోకే ప్రమాదం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ కింది టిప్స్‌ని ఫాలో అవండి. మీతో పాటు కుటుంబాన్నంతా కాపాడుకోండి.

1. బయట నుంచి తీసుకొచ్చిన వస్తువులను డైరెక్ట్‌గా తాకకుండా చేతులకు శానిటైజర్ రాసుకుని పట్టుకోండి.
2. అలాగే పాల ప్యాకెట్లను, కూరగాయలను, ఫ్రూట్స్‌ని శుభ్రంగా కడిగి, చేతులను కూడా వాష్ చేసుకోవాలి.
3. ప్రస్తుతం కరోనా ప్రబలుతున్న తరుణంలో న్యూస్ పేపర్స్‌ని రద్దు చేయడం మంచింది.
4. కొరియర్స్, ఇతరత్రా వాటి కోసం ఇంటి బయట ఓ ట్రై ఏర్పాటు చేసుకోండి.
5. పని మనుషులకు నిర్భంద కాలం తప్పదు.
6. ఆన్ లైన్ ఫుడ్ డెలివరీస్‌ని రద్దు చేయండి.
7. మొబైల్ ఫోన్లు, రిమోట్ కంట్రోల్, కీ బోర్డ్స్ తరుచూ శుభ్రం చేసుకోవాలి.
8. అత్యవసరంగా బయటకు వెళ్లి వస్తే.. వెంటనే స్నానం చేయాలి.
9. ఇక వృద్ధులు ఈ కాలంలో వాకింగ్‌లకు వెళ్లకపోవడమే మంచిది.

Read more also:

బ్రేకింగ్ న్యూస్: ఈ నెల 31 వరకూ బస్సులు, రైళ్లు సర్వీసులు బంద్

 కరోనా సోకిన వారిలో చనిపోయే ఛాన్స్ ఎక్కువగా పురుషులకే ఉందట..

కరోనా సోకిన వారిలో చనిపోయే ఛాన్స్ ఎక్కువగా పురుషులకే ఉందట..

Click on your DTH Provider to Add TV9 Telugu