కరోనా ఎఫెక్ట్.. మహారాష్ట్రలో మరో ముగ్గురు పోలీసులు మృతి
మహారాష్ట్ర పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్షన్నరకు చేరువలో ఉన్నాయి. అందులో పోలీసులు కూడా పెద్ద ఎత్తున కరనా బారినపడుతున్నారు.

మహారాష్ట్ర పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్షన్నరకు చేరువలో ఉన్నాయి. అందులో పోలీసులు కూడా పెద్ద ఎత్తున కరనా బారినపడుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 4వేలకు పైగా పోలీసులు కరోనా బారినపడ్డారు. అంతేకాదు.. పదుల సంఖ్యలో కరోనా బారినపడి మరణిస్తున్నారు. తాజాగా.. గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి ముగ్గురు పోలీసులు మరణించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా బారినపడి మరణించిన పోలీస్ సిబ్బంది సంఖ్య 54కి చేరింది. ప్రస్తుతం కరోనా బారినపడి 991 మంది పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని.. ఇప్పటికే 3,239 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని అధికారులు తెలిపారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,42,900 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. దేశంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచే నమోదవుతున్నాయి.
Death toll rises to 54 among police personnel with 3 deaths being reported in the last 24 hours. Till date, 3239 police personnel have been cured and 991 are under treatment: Maharashtra Police
— ANI (@ANI) June 25, 2020



