వచ్చే నెల నుంచి మొదలు కానున్న ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్!

దర్శకుడు రాజమౌళి ఎంతో  ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటికే టెస్ట్ షూట్ కోసం ఏర్పాట్లు షురూ అయ్యాయి. భద్రతా ప్రమాణాల్ని పాటిస్తూ ఈ వారంలోనే దానిని నిర్వహించబోతున్నట్టు...

వచ్చే నెల నుంచి మొదలు కానున్న 'ఆర్ఆర్ఆర్' షూటింగ్!

దర్శకుడు రాజమౌళి ఎంతో  ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటికే టెస్ట్ షూట్ కోసం ఏర్పాట్లు షురూ అయ్యాయి. భద్రతా ప్రమాణాల్ని పాటిస్తూ ఈ వారంలోనే దానిని నిర్వహించబోతున్నట్టు సమాచారం. జులై నుంచి ఆర్ఆర్ఆర్ షూట్ ప్రారంభం కానుంది. దీంతో టాలీవుడ్ యంగ్ హీరోస్ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ సెట్లోకి దిగే అవకాశాలున్నాయి. కాగా కరోనా లాక్‌డౌన్ తర్వాత చిత్రీకరణలకు అనుమతులు ఇచ్చిన వెంటనే ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లాలనుకున్నారు డైరెక్టర్ రాజమౌళి. అయితే అది సాధ్యం కాలేదు. త్వరలోనే టెస్ట్ షూట్‌తో సాధ్యాసాధ్యాల్ని పరిశీలించి పనుల్ని వేగవంతం చేయనున్నట్టు ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. కాగా ఈ సినిమాని దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తుండగా.. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. అలాగే బాలీవుడ్ నటులు ఆలియా భట్‌, అజయ్ దేవగణ్‌, శ్రియతో పాటు తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా వచ్చే ఏడాది వేసవికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.

Read More: పెట్రోల్ ధరల మోత.. వాహనదారులకు ఝలక్..

Click on your DTH Provider to Add TV9 Telugu