తెలంగాణలో స్వల్పంగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు.. కొత్తగా 149 మందికి నిర్దారణ, ఒకరు మృతి
గడిచిన 24 గంటల వ్యవధిలో 149 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్దారణ అయ్యినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Telangana Corona cases : తెలంగాణ రాష్ట్రంలో గత కొంతకాలంగా తగ్గుతూ వచ్చిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇవాళ స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 149 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్దారణ అయ్యినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఈ ఉదయం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. తాజాగా కరోనా వైరస్ కారణంగా ఒకరు మృతి చెందారు. దీంతో మరణాల సంఖ్య 1,612కు చేరింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 18వందలకు పైగా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
కాగా, గడిచిన 24గంటల్లో కరోనా నుంచి 186 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక, ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 2,95,831 కు చేరుకుంది. కాగా, ఇప్పటివరకు 2,92,415 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
ఇక, తెలంగాణలో కరోనా మృతుల శాతం 0.54 శాతంగా ఉంటే.. దేశవ్యాప్తంగా 1.4 శాతంగా ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌లో పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,804 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు దేశ వ్యాప్తంగా కూడా కరోనా కేసులు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,100 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ మంగళవారం తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,08,47,304కు చేరింది.
Read Also… Coronavirus India: దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు, మరణాలు.. తాజాగా ఎన్ని నమోదయ్యాయంటే..?