Coronavirus: కరోనా ఫోర్త్ వేవ్‌పై తెలంగాణ హెల్త్ డైరెక్టర్ కీలక ప్రకటన.. మాస్క్‌లు తప్పనిసరి..
Coronavirus: దేశవ్యాప్తంగా మరోసారి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితిల్లో ఎలాంటి నిబంధనలు లేవని కానీ...
Coronavirus: దేశవ్యాప్తంగా మరోసారి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితిల్లో ఎలాంటి నిబంధనలు లేవని కానీ జాగ్రత్తలు తప్పనిసరి అని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరిగా ఉపయోగించాలని, లేకపోతే రూ. వెయ్యి ఫైన్ ఉంటుందని హెచ్చరించారు. హైదరాబాద్ ప్రజల్లో 97 శాతం మందికి యాంటీ బాడిస్ గుర్తించినట్లు తెలిపిన హెల్త్ డైరెక్టర్.. ప్రస్తుతం తెలంగాణలో భయపడాల్సిన అవసరం లేదని, కానీ పక్క రాష్ట్రల్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు.
ఇదే విషయమై శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. ‘ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. అందరూ వ్యా్క్సిన్ వేసుకోవాలి. 60 ఏళ్లు పైబడిన వారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో బూస్టర్ డోస్ అందుబాటులో ఉంది. 18 నుంచి 59 ఏళ్ల వయసు వారికి ప్రైవేటు కేంద్రాలలో అందుబాటులో ఉంది. కేంద్రం అనుమతి ఇస్తే ప్రభుత్వ కేంద్రాల్లో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కరోనా ఉధృతంగా ఉన్న రాష్ట్రాలలో R విలువ 1కిపైగా ఉంది. ఇది తెలంగాణంలో కేవలం 0.5 మాత్రమే ఉంది. తెలంగాణలో ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశం రాదని సిరో సర్వేలో తేలింది. అయితే మన జాగ్రత్తలో మనం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కరోనా జాగ్రత్తలు తప్పనిసరిగా పాటిస్తూ.. గుంపులో ఉన్నప్పుడు మాస్కును తప్పకుండా ధరించాలి’ అని చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే దేశంలో మరోసారి కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. వరుసగా రెండో రోజూ కూడా కేసుల సంఖ్య రెండు వేల మార్క్ దాటింది. కోవిడ్ థర్డ్ వేవ్ అనంతరం కేసులు, మరణాల సంఖ్య భారీగా తగ్గిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేసుల సంఖ్య.. మరణాలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఫోర్త్ వేవ్ భయాందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సైతం.. కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్రాలను ఆదేశించింది. ముఖ్యంగా ఢిల్లీ, యూపీ, హర్యానా, మహారాష్ట్రలో కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. గడిచి 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,380 కేసులు నమోదయ్యాయి.
Also Read: Bank News: CAR నిష్పత్తితో బ్యాంక్ బలాన్ని ఇలా తెలుసుకోండి..
Plane Crash: హైతిలో సోడా బాటిళ్ల ట్రక్కును ఢీ కొన్న చిన్న విమానం.. ఐదుగురు మృతి.. ప్రధాని సంతాపం
Picture Puzzle: వాసి వాడి తస్సదియ్య.. ఈ ఫోటోలో చిరుతను కనిపెడితే మీరు తోపు అంతే..