Lockdown In Hyderabad: కరోనా కట్టడికి లాక్‌డౌన్ ఒక్కటే మార్గమని దేశంలోని చాలా రాష్ట్రాలు నిర్ధారణకు వచ్చాయి. ఇందులో భాగంగానే చాలా ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధిస్తున్నారు. అంతేకాకుండా లాక్‌డౌన్ మంచి సత్ఫలితాలను ఇస్తోన్న నేపథ్యంలో ఇప్పటి వరకు అమల్లో ఉన్న నింధనలను ప్రభుత్వాలు మరింత కఠినతరం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో ఆంక్షలను మరింత కఠినతరం చేస్తోంది.
ప్రస్తుతం ప్రత్యేక అనుమతులున్నవారికి మాత్రమే రోడ్డుపైకి వచ్చే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఇదిలా ఉంటే లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేసే క్రమంలో హైదరాబాద్ పోలీసులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే రేపటి నుంచి (ఆదివారం) నగరంలో భారీ వాహనాలకు (లోడ్‌తో ఉన్నవి, లోడ్‌తో లేనివి) రాత్రి 9 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు మాత్రమే అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మిగతా సమయంలో ఎలాంటి గూడ్స్ వాహనాలను అనుమతిచ్చేది లేదని స్పష్టం చేశారు. అయితే ఈ నిబంధనల నుంచి ఆక్సిజన్, గ్యాస్ సిలిండర్, వైద్య సంబంధిత వస్తువులు, వాటర్ ట్యాంకర్లకు మినహాయింపు ఇస్తూ ప్రకటన చేశారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 12 నుంచి లాక్‌డౌన్ విధిస్తూ సీఎం కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. నిజానికి మొదట్లో లాక్‌డౌన్‌ను 21కి పరిమితం చేసిన ప్రభుత్వం.. అనంతరం ఈ నెలాఖరుకు పొడగించింది.
Also Read: Rohit-Virat: బెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మ.. కానీ కోహ్లీ సూపర్బ్ అంటోన్న టీమిండియా పేసర్.!
Special Trains: రైల్వే ప్రయాణీకులకు అలెర్ట్.. మరికొన్ని రైళ్లు రద్దు.. వివరాలివే..
Keerthi Suresh: పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన కీర్తి సురేష్.. తానే మొదట చెబుతానంటూ..!