వూహాన్.. 76 రోజుల లాక్ డౌన్ ఎత్తివేత.. ఇండియన్స్ హ్యాపీ

వూహాన్.. 76 రోజుల లాక్ డౌన్ ఎత్తివేత.. ఇండియన్స్ హ్యాపీ

చైనాలోని వూహాన్ లో 76 రోజుల లాక్ డౌన్ ని బుధవారం ఎత్తివేశారు. తమ ఇళ్ళు. లేదా తమ గదుల్లోనే ఇన్నాళ్లూ చిక్కుకుపోయిన భారతీయులు ఈ ఆంక్షల రద్దుతో ఒక్కసారిగా బయటకు వఛ్చి సంతోషంతో కేరింతలు కొట్టారు. ఇన్ని రోజులుగా నాలుగు గోడల మధ్య గడిపిన తామిక హ్యాపీగా, స్వేఛ్చ గా ఈ సిటీలో తిరగ గలుగుతామని వారంటున్నారు. అరుణ్ జిత్ సత్రజిత్ అనే వ్యక్తి మాట్లాడుతూ.. తన గదిలో ఒంటరిగా ఎలా గడిపానో తనకే తెలియదని, […]

Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Apr 09, 2020 | 7:40 PM

చైనాలోని వూహాన్ లో 76 రోజుల లాక్ డౌన్ ని బుధవారం ఎత్తివేశారు. తమ ఇళ్ళు. లేదా తమ గదుల్లోనే ఇన్నాళ్లూ చిక్కుకుపోయిన భారతీయులు ఈ ఆంక్షల రద్దుతో ఒక్కసారిగా బయటకు వఛ్చి సంతోషంతో కేరింతలు కొట్టారు. ఇన్ని రోజులుగా నాలుగు గోడల మధ్య గడిపిన తామిక హ్యాపీగా, స్వేఛ్చ గా ఈ సిటీలో తిరగ గలుగుతామని వారంటున్నారు. అరుణ్ జిత్ సత్రజిత్ అనే వ్యక్తి మాట్లాడుతూ.. తన గదిలో ఒంటరిగా ఎలా గడిపానో తనకే తెలియదని, ఇప్పుడు అధికారుల అనుమతితో దగ్గరలోనే ఉన్న తన ల్యాబ్ కి వెళ్తున్నానని చెప్పాడు. హైడ్రో బయాలజిస్ట్ అయిన ఈయన.. ఇప్పుడు నేను ఎక్కువగా మాట్లాడలేకపోతున్నా.. ఇందుకు కారణం.. ఈ రెండు నెలలూ ఇలా మౌనంగా గడపడమే’ అన్నాడు. ఇండియన్ ఎయిర్ లైన్స్ కి చెందిన రెండు విమానాలు గత జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఈ సిటీ నుంచి సుమారు 700 మంది భారతీయులు, విదేశీయులను వారి వారి స్వదేశాలకు తరలించినప్పటికీ అరుణ్ జిత్ వంటి భారతీయులు మాత్రం ఇక్కడే ఉండిపోయారు. కరోనా బీభత్సంతో వూహాన్ తల్లడిల్లినప్పటికీ.. మొండిగా తాను ఇక్కడే ఉండిపోయానని., మరికొందరు భారతీయులు కూడా ఇలాగే కదలలేదని ఆయన చెప్పాడు. ఇక భారత ప్రభుత్వం దేశవ్యాప్త లాక్ డౌన్ కి పిలుపునిచ్చిమంచి పని చేసిందని, అలాగే సోషల్ డిస్టెంసింగ్ విధానం కూడా మంచి ఫలితాలను ఇస్తుందని ఆయన అన్నాడు. కానీ వర్షాకాలం వస్తే ఈ వైరస్ కారణంగా మళ్ళీ ప్రాబ్లమ్ తలెత్తవచ్చునని, పైగా అప్పుడు మనుషుల రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందని ఆయన అన్నాడు. వూహాన్ లో ప్రజలంతా ఖఛ్చితంగా లాక్ డౌన్ పాటించి సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉండడం విశేషమని, ఇదే తమకు పాఠం నేర్పిందని పేర్కొన్నాడు. ఇండియాకు చెందిన ఓ శాస్త్రవేత్త కూడా ఈయనతో ఏకీభవించాడు. తాను కేరళకు చెందిన వాడినని, ఇక్కడి భారత ఎంబసీ తనను ఇండియాకు పంపేందుకు సిధ్ధపడినా నేను అంగీకరించలేదని ఆయన చెప్పాడు. మళ్ళీ నేను కేరళ వెళ్లి నా కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టదలచు కోలేదు.. అయితే సమయం వస్తే నా రాష్ట్రానికి వెళ్తా అన్నాడాయన.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu