ఏపీలో నడిచే రైళ్ల వివరాలు ఇవే..

ఏపీలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రైలు ప్రయాణం చేయడానికి అవకాశం లేకుండా.. ప్రారంభ, గమ్యస్థానాలు రెండూ కూడా రాష్ట్ర పరిధిలోనే ఉన్నవారు తమ ప్రయాణాలను క్యాన్సిల్ చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వేశాఖ సూచించింది.

ఏపీలో నడిచే రైళ్ల వివరాలు ఇవే..
Follow us

|

Updated on: Jun 01, 2020 | 4:24 PM

నేటి నుంచి దేశవ్యాప్తంగా 200 ప్యాసింజర్ రైళ్లు పట్టాలెక్కాయి. విజయవాడ మీదగా 14 రైళ్లు నడవనున్నాయి. ప్రధాన నగరాలైన ముంబై, భువనేశ్వర్, చెన్పై, బెంగళూరు, ఢిల్లీకి ఈ రైళ్లు నడవనున్నాయి. ఇదిలా ఉంటే ఏపీ పరిధిలోని రైలు ప్రయాణాలపై దక్షిణ మధ్య రైల్వే పలు ఆంక్షలు విధించింది. ఇతర రాష్ట్రాల నుంచి రైళ్ల ద్వారా ఏపీలోకి వచ్చేవారికి కరోనా టెస్టులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని స్టేషన్లలో ఏర్పాట్లు చేయడం వల్ల.. ఆయా స్టేషన్లకే హాల్టులు పరిమితం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ కుమార్‌కు లేఖ రాయగా.. SCR ఏపీ పరిధిలోని రైలు ప్రయాణాలపై నిబంధనలు వర్తిస్తాయంది.

ఏపీలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రైలు ప్రయాణం చేయడానికి అవకాశం లేకుండా.. ప్రారంభ, గమ్యస్థానాలు రెండూ కూడా రాష్ట్ర పరిధిలోనే ఉన్నవారు తమ ప్రయాణాలను క్యాన్సిల్ చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వేశాఖ సూచించింది. అలాంటివారి డబ్బులు పూర్తిగా రీఫండ్ ఇస్తామని స్పష్టం చేసింది. ఇక రిజర్వేషన్ ఉన్నవారికి మాత్రమే రైల్వేస్టేషన్లలోకి అనుమతిస్తారు. ప్రతీ ఒక్కరూ సామాజిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం తప్పనిసరి. ప్రయాణీకులు గంటన్నర ముందు స్టేషన్‌కు చేరుకోవాలి.. థర్మల్ స్క్రీనింగ్ అనంతరం వారిని అనుమతిస్తారు. రైలు బయలుదేరే నాలుగు గంటల ముందు మొదటి చార్ట్, రెండు గంటల ముందు రెండో చార్ట్‌ను విడుదల చేస్తారు.

76127503

లింక్