SonuSood Foundation: కరోనా ఆపత్కాల సమయంలో ఎంతో మందికి సేవ చేసి అండగా నిలుస్తున్నారు నటుడు సోనూసూద్. అడిగిన వారికి లేదనకుండా సాయం చేస్తూ కలియుగ కర్ణుడిగా మారారు సోనూ. దేశంలో ప్రతీ రోజూ ఏదో చోట.. ఎవరో ఒకరు.. సోనూసూద్ వల్ల సాయం పొందుతున్నారనడంలో ఎలాంటి అతిశకయోక్తి లేదు. అయితే సోనూ ఎంతో మానవతా ధృక్పథంతో చేస్తోన్న సేవను కూడా కొందరు కేటుగాళ్లు దారి తప్పిస్తున్నారు. తన పేరుతో ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు.
తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. నటుడు సోనూసూద్ ఫౌండేషన్ పేరుతో సోషల్ మీడియాలో ఓ నకిలీ ప్రచారం జరుగుతోంది. సోనూసూద్ పేరు, ఫొటోను వాడుకుంటూ కొందరు నకిలీ విరాళాలు చేపడుతున్నారు. ఇక సోనూసూద్ లాంటి వ్యక్తికి చెందిన సంస్థ అని.. కొందరు వెనకా ముందూ చూసుకోకుండా డబ్బులు పంపిస్తున్నాయి. అయితే ఈ విషయం కాస్త సోనూసూద్ కంటిలో పడింది. దీంతో తన అభిమానులను అప్రమత్తం చేశారు సోనూ. ట్విట్టర్ వేదికగా నకిలీ విరాళాలకు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను షేర్ చేస్తూ.. హెచ్చరిక అనే క్యాప్షన్‌ను జోడించారు సోనూసూద్. ఆ సంస్థకు తనకు ఎలాంటి సంబంధం లేదని అభిమానులకు సందేశం ఇచ్చారు.
? WARNING ? pic.twitter.com/ADnycHK0f2
— sonu sood (@SonuSood) May 17, 2021
Also Read: Naga Chaitanya Samantha: మరోసారి వెండితెరపై రియల్ కపుల్.. నాగ్ సినిమాలో సమంత, నాగచైతన్య..
నాకు అంత టాలెంట్ లేదు.. ఐటం గర్ల్ అన్న గుర్తింపు పట్ల ఎలాంటి రిగ్రెట్స్ లేవు.. బిగ్‌బాస్ బ్యూటీ..