AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాకు అంత టాలెంట్ లేదు.. ఐటం గర్ల్ అన్న గుర్తింపు పట్ల ఎలాంటి రిగ్రెట్స్ లేవు.. బిగ్‏బాస్ బ్యూటీ..

Rakhi Sawant: బిగ్ బాస్ సీజన్ 14లో తన ఆటతీరుతో ప్రేక్షకులకు దగ్గరయ్యింది రాఖీ సావంత్. హౌస్ లో మోస్ట్ ఎంటర్ టైనర్ గా ఎంతో మంది ప్రేక్షకుల

నాకు అంత టాలెంట్ లేదు.. ఐటం గర్ల్ అన్న గుర్తింపు పట్ల ఎలాంటి రిగ్రెట్స్ లేవు.. బిగ్‏బాస్ బ్యూటీ..
Rakhi Sawant
Rajitha Chanti
|

Updated on: May 17, 2021 | 10:23 PM

Share

Rakhi Sawant: బిగ్ బాస్ సీజన్ 14లో తన ఆటతీరుతో ప్రేక్షకులకు దగ్గరయ్యింది రాఖీ సావంత్. హౌస్ లో మోస్ట్ ఎంటర్ టైనర్ గా ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఇక బిగ్ బాస్ ఇంట్లో రాఖీ చేసిన అల్లరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బోల్డ్ నెస్ తోపాటు కాంట్రవర్సీ క్వీన్ గానూ పేరు తెచ్చుకుంది రాఖీ. తాజాగా ఈ బొద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు బాలీవుడ్ పరిశ్రమలో ఐటం  గర్ల్ అన్న గుర్తింపు రావడం పై ఎలాంటి రిగ్రెట్స్ లేవని..అయినా తనకు హీరోయిన్ పాత్ర పోషించేంత టాలెంట్ కూడా లేదని తెలిపింది. బాలీవుడ్ లో ప్రతి ఒక్కరూ హీరోయిన్ కాలేరు. కొందరికి ఐటం గర్ల్ గా ఛాన్సులొస్తే.. మరికొందరికి తల్లి, చెల్లి, ఫ్రెండ్, నెగిటివ్ రోల్స్ లేదా మరిన్ని చిన్న చిన్న పాత్రలు వస్తుంటాయి. అయినా కెరీర్ లో ఐటం సాంగ్స్ చేయడం వలన నేనేమి బాధపడడం లేదు. ఎందుకంట అలా సంపాదించిన డబ్బుతోనే నా కుటుంబాన్ని పోషిస్తున్నాను. అంతేకాకుండా.. ఐటం గర్ల్ గా బాలీవుడ్ లో నాకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించినందుకు ఎంతో గర్వపడుతున్నాను అని చెప్పింది. Bigg Boss Season 14

రాఖీ సావంత్.. మొహబ్బత్ హై మిర్చి నుంచి దేఖ్తా హైతూ క్యా… వరకు పలు పాటలలో కనిపించారు. మాస్టి, మెయిన్ హూ నా, దిల్ బోలే హడిప్ప వంటి సినిమాల్లో ఆమె చిన్న చిన్న పాత్రలు చేసింది. అలాగే నాచి బలియే, పతి పత్ని జౌర్ వో, నాచ్కే దిఖా, బిగ్ బాస్ వంటి రియాలిటీ షోలలో నటించింది.

Also Read: ల్యాప్‏టాప్‏లలో ఎక్కువగా వర్క్ చేస్తున్నారా ? ఆరోగ్యానికి మరింత రిస్క్.. హెచ్చరిస్తున్న నిపుణులు..

పండ్లు, కూరగాయలు తినడం వలన ఒత్తిడి ఫసక్… అధ్యయనాల్లో వెలువడిన సంచలన విషయాలు..

పసుపు పాలతో తాగితే బరువు తగ్గుతారా ? వెయిట్ లాస్ మాత్రమే కాకుండా ఇమ్యూనిటీని పెంచే ఆహారాలు ఇవే..