లాక్ డౌన్ తో కోవిడ్19 వ్యాప్తి తగ్గలేదు…శశి థరూర్

తన నియోజకవర్గంలో లాక్ డౌన్ విధించినప్పటికీ కోవిడ్ -19 వ్యాప్తి తగ్గలేదని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అన్నారు. కేరళలో గత 24 గంటల్లో 702 కొత్త కరోనావైరస్ కేసులు నమోదు కాగా...

  • Umakanth Rao
  • Publish Date - 9:59 am, Tue, 28 July 20
లాక్ డౌన్ తో కోవిడ్19 వ్యాప్తి తగ్గలేదు...శశి థరూర్

తన నియోజకవర్గంలో లాక్ డౌన్ విధించినప్పటికీ కోవిడ్ -19 వ్యాప్తి తగ్గలేదని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అన్నారు. కేరళలో గత 24 గంటల్లో 702 కొత్త కరోనావైరస్ కేసులు నమోదు కాగా…. తిరువనంతపురంలో 161 కేసులు నమోదయ్యాయని ఆయన ట్వీట్ చేశారు. ఈ సిటీలో మూడు వారాలపాటు కఠిన లాక్ డౌన్ ని ప్రభుత్వం విధించింది. కానీ కరోనా వ్యాప్తిని అదుపు చేయలేకపోయామని, ప్రజలు లాక్ డౌన్ కారణంగా తమ పనులకు వెళ్లలేకపోతున్నారని శశి థరూర్ పేర్కొన్నారు. ఇప్పటికైనా నిబంధనలను సడలించి వారు మళ్ళీతమ పనులకు వెళ్లేలా అనుమతించాలని ఆయన కోరారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని అభ్యర్థించారు.   కాగా-లాక్ డౌన్  నిబంధనలను సడలించేలా, ఇందుకు గల అవకాశాలను పరిశీలించేందుకు  ఓ కమిటీని నియమిస్తున్నట్టు సీఎం పినరయి విజయన్ తెలిపారు.  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఈ కమిటీ పని చేస్తుందన్నారు.

ఈ రాష్ట్రంలో 19,727 కరోనా కేసులు నమోదు కాగా..63 మంది కరోనా రోగులు మృతి చెందారు.