రష్యా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌ సేఫ్‌: లాన్సెట్‌ జర్నల్‌

రష్యా కరోనా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌ సేఫ్‌ అని లాన్సెట్‌ జర్నల్‌ ప్రకటించింది. మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌ నిర్వహంచకుండానే వ్యాక్సిన్‌ ప్రయోగించడంపై అనుమానాలు కలిగాయి. కాని ఈ ఆరోపణల్లో నిజం లేదని లాన్సెట్‌ జర్నల్‌ ప్రకటించింది.

  • Tv9 Telugu
  • Publish Date - 12:02 pm, Sat, 5 September 20
రష్యా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌ సేఫ్‌: లాన్సెట్‌ జర్నల్‌

రష్యా కరోనా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌ సేఫ్‌ అని లాన్సెట్‌ జర్నల్‌ ప్రకటించింది. ఈ వ్యాక్సిన్‌పై ప్రపంచవ్యాప్తంగా గతంలో ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి. మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌ నిర్వహంచకుండానే వ్యాక్సిన్‌ ప్రయోగించడంపై అనుమానాలు కలిగాయి. కాని ఈ ఆరోపణల్లో నిజం లేదని లాన్సెట్‌ జర్నల్‌ ప్రకటించింది. వ్యాక్సిన్‌ ప్రయోగించిన వాళ్లలో కరోనాను ఎదుర్కోనే యాంటీ బాడీస్‌ తయారైనట్టు వెల్లడించింది. అయితే కీలకమైన ఫేజ్‌-3 వివరాలు ఇంకా ప్రకటించలేదని, తొందరపడి రష్యా వ్యాక్సిన్‌పై తుది నిర్ణయానికి ఇప్పుడే రావొద్దని నిపుణులు చెబుతున్నారు.

లాన్సెట్‌ ‌ జర్నల్‌ రష్యా వ్యాక్సిన్‌ విషయంలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. 76 మందిపై వ్యాక్సిన్‌ ప్రయోగం చేసినట్టు తెలిపింది. వాళ్లలో ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ కన్పించలేదని వెల్లడించింది. 42 రోజుల పాటు క్లినికల్‌ ట్రయల్స్‌ తరువాత ఈ విషయాలు బయటపడ్డాయని తెలిపింది. 21 రోజుల్లోనే వాలంటీర్లలో యాంటీబాడీస్‌ తయారైనట్టు లాన్సెట్‌ జర్నల్‌ వెల్లడించింది.

రష్యా వ్యాక్సిన్‌పై కొత్త వివరాలు ప్రకటించలేదని, పాత డేటాను విడుదల చేశారని వైద్యరంగ నిపుణులు చెప్పారు . లాన్సెట్‌ జనరల్‌లో ప్రచురితమైంది కేవలం ఫేజ్-1,2కు సంబంధించిన డేటా మాత్రమేనని డాక్టర్ ముఖర్జీ చెప్పారు. రష్యా వ్యాక్సిన్‌ పనిచేస్తుందనే అంచనాకు ఇప్పుడే రావొద్దని చెప్పారు. కేవలం 76 మందిపై జరిపిన ప్రయోగాల వివరాలు మాత్రమేనని అన్నారు.