రష్యాలో కరోనా విలయ తాండవం.. తాజాగా 6,852 కేసులు.
రష్యాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా శనివారం నాడు కొత్తగా మరో 6,852 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
రష్యాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా శనివారం నాడు కొత్తగా మరో 6,852 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,27,646కి చేరింది. ఈ విషయాన్ని రష్యా ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. శనివారం నమోదైన కేసులు రష్యాలోని 85 ప్రాంతాల్లో నమోదైనవని తెలిపారు. మాస్కోలో 750 కేసులు నమోదవ్వగా.. మాస్కో రీజియన్ మరియు కంటే మన్సీ ప్రాంతంలో 280 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రిపోర్టులో పేర్కొన్నారు. ఇక ఇప్పటి వరకు కరోనా బారినపడి 8,969 మంది మరణించారు. దేశ వ్యాప్తంగా కరోనా నుంచి 3,93,352 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కాగా, ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు కోటికి చేరువయ్యాయి. మరో నాలుగైదు రోజుల్లో కేసుల సంఖ్య ఇలానే నమోదైతే.. కోటికి చేరేలా ఉంది. ఇప్పటి వరకు వ్యాక్సిన్ రెడీ కాకపోవడం ఆందోళన కలిగిస్తున్న అంశం.