సూపర్ స్పైడర్స్… ఇద్దరు మహిళల ద్వారా 36 మందికి కరోనా

ఏపీలో కరోనా కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు.. రోజు రోజుకు మరింత వేగంగా పెరుగుతున్నాయి. టెస్టుల సంఖ్య పెంచుతున్నా కొద్దీ కేసులు బయటపడుతూనే ఉన్నాయి. సామ‌ర్ల‌కోట అమ్మ‌ణ్ణ‌మ్మ గృహ స‌ముదాయంలో 36 కరోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి.

సూపర్ స్పైడర్స్... ఇద్దరు మహిళల ద్వారా 36 మందికి కరోనా
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 27, 2020 | 5:38 PM

ఏపీలో కరోనా కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు.. రోజు రోజుకు మరింత వేగంగా పెరుగుతున్నాయి. టెస్టుల సంఖ్య పెంచుతున్నా కొద్దీ కేసులు బయటపడుతూనే ఉన్నాయి. శనివారం బులిటెన్‌లో మొదటిసారి రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో మరో 740 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి 51మందికి.. ఇతర దేశాల నుంచి వచ్చిన ఐదుగురికి వైరస్ సోకింది.. దీంతో మొత్తం కేసులు 796కు చేరాయి. ఇక తూర్పుగోదావరి జిల్లాలోనే క‌రోనా వైర‌స్ కేసులు వెయ్యి దాటాయి.

ఇప్ప‌టి వ‌ర‌కు తూర్పుగోదావరి జిల్లాలో 98, 340 మంది నుంచి శాంపిల్స్ సేక‌రించ‌గా, 1,060 మందికి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయ్యింది. వీరిలో 663 మంది ప్ర‌స్తుతం ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతుండ‌గా, 386 మంది డిశ్చార్జి అయ్యారు. క‌రోనాతో 11 మంది మృత్యువాత‌ప‌డ్డారు. దీంతో అధికారులు 130 చోట్ల‌ను కంటైన్మెంట్‌గా ప్ర‌క‌టించారు. సామ‌ర్ల‌కోట అమ్మ‌ణ్ణ‌మ్మ గృహ స‌ముదాయంలో 36 కరోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి.

అమ్మణ్ణమ్మ కాలనీకి చెందిన ఇద్దరు మహిళలు ఈ నెల 17న హైదరాబాద్ వెళ్లి వచ్చారు. ఆ తర్వాత యథేచ్ఛగా సంచరించారు. దీంతో వీరిద్దరికి పరీక్షలు చేయగా, పాజిటివ్ వచ్చింది. ఫలితంగా అదే కాలనీలో ఉంటున్న వారందరికీ పరీక్షలు చేయగా, ఆ ఇద్దరి నుంచి వైరస్ వ్యాపించి ఏకంగా 36 మంది బాధితులుగా తేలారు. దీంతో కాలనీ మొత్తం రెడ్ జోన్‌లోకి వెళ్లిపోయింది. మామిడాడ తరహాలో ఈ కాలనీ చాలా ఇరుగ్గా ఉంటుంది. దీంతో వైరస్ సులువుగా మూలమూలకు విస్తరించింది. దీంతో కాకినాడ జ‌గ‌న్నాథ‌పురాన్నిఅధికారులు రెడ్‌జోన్‌గా ప్ర‌క‌టించారు. మెయిన్‌రోడ్డులోని షాపుల‌ను అధికారులు మూసివేశారు.