శ్రీకాళహస్తిలో మళ్లీ లాక్‌డౌన్
శ్రీకాళహస్తి పట్టణంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రేపటి నుంచి మళ్లీ లాక్‌డౌన్ అమలు చేయాలని శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ నిర్ణయించారు. వ్యాపార వాణిజ్య కేంద్రాల అనుమతులపై పలు కీలక సూచనలు చేశారు.
శ్రీకాళహస్తి పట్టణంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రేపటి నుంచి మళ్లీ లాక్‌డౌన్ అమలు చేయాలని శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ నిర్ణయించారు. వ్యాపార వాణిజ్య కేంద్రాల అనుమతులపై పలు కీలక సూచనలు చేశారు. ప్రజలంతా లాక్‌డౌన్ నిబంధనలు తప్పక పాటించాలని తెలిపారు.
ఏపీలో కరోనా వీరవిహారం చేస్తోంది. దీంతో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో కోవిడ్ కోరలు చాస్తోంది. శ్రీకాళహస్తిలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రేపటి నుండి లాక్‌డౌన్‌ను అమలు చేయనున్నారు. రేపటి నుండి శ్రీకాళహస్తిలో దుకాణాలను ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1గంట వరకు మాత్రమే తెరవాలని పురపాలక కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. అటు బహిరంగ ప్రదేశాల్లో తిరిగే వాళ్లు మాస్క్ లేకుండా వస్తే రూ. 100ల జరిమానా విధించనున్నట్లు ప్రకటించారు. కాగా, శ్రీకాళహస్తిలో ఇప్పటి వరకు 142 కరోనా కేసులు నమోదవడం తెలిసిందే.