బ్రేకింగ్.. కేంద్ర మాజీ మంత్రికి కరోనా పాజిటివ్

కేంద్ర మాజీ మంత్రి, ఆర్జేడీ సీనియర్ నేత రఘువాన్స్ ప్రసాద్ సింగ్ కరోనా బారినపడ్డారు. ఆయన గత కొద్ది రోజులుగా అస్వస్థతకు గురవ్వడంతో.. మంగళవారం నాడు ఆయన పాట్నాలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు.

బ్రేకింగ్.. కేంద్ర మాజీ మంత్రికి కరోనా పాజిటివ్
Follow us

| Edited By:

Updated on: Jun 17, 2020 | 10:12 PM

కేంద్ర మాజీ మంత్రి, ఆర్జేడీ సీనియర్ నేత రఘువాన్స్ ప్రసాద్ సింగ్ కరోనా బారినపడ్డారు. ఆయన గత కొద్ది రోజులుగా అస్వస్థతకు గురవ్వడంతో.. మంగళవారం నాడు ఆయన పాట్నాలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చేరేముందు జ్వరం ఉండటంతో.. వైద్యులు ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో ఆయనకు బుధవారం నాడు కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆయనకు ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన వయస్సు 75 ఏళ్లు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

ఇదిలావుంటే.. బీహార్‌లో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వలస కూలీలు స్వరాష్ట్రానికి చేరుకోవడంతో.. వారిని క్వారంటైన్‌లో ఉంచారు. అయితే అక్కడ అనేక మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. వారందరికీ చికిత్స పలు ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఏడువేల కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి.