బ్రేకింగ్: లాక్‌డౌన్‌ని కొనసాగించాలని ప్రధానిని కోరుతున్నా

| Edited By:

Apr 06, 2020 | 8:46 PM

ప్రస్తుతం దేశ వ్యాప్తంగానే కాకుండా.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ మరో సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. లాక్‌డౌన్‌ని కొనసాగించాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరుతున్నా..

బ్రేకింగ్: లాక్‌డౌన్‌ని కొనసాగించాలని ప్రధానిని కోరుతున్నా
Follow us on

ప్రస్తుతం దేశ వ్యాప్తంగానే కాకుండా.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ మరో సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. లాక్‌డౌన్‌ని కొనసాగించాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరుతున్నా అని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో గత మూడు, నాలుగు రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య పదుల సంఖ్యలో నమోదవడంతో.. సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టిపెట్టారు. సోమవారం నాటికి రాష్ట్రంలో 364 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని.. దీంతో కరోనా వ్యాప్తి నియంత్రణపై ప్రగతిభవన్‌లో అధికారులతో  చేపట్టిన రివ్యూమీటింగ్‌లో కేసీఆర్  మీడియాతో మాట్లాడారు.

కేసీఆర్ కీలక వ్యాఖ్యలు:

1. లాక్‌డౌన్‌ను మరింత పకడ్బందీగా అమలు చేస్తున్నా
2. లాక్‌డౌన్‌ను ఎంత గట్టిగా పాటిస్తే అంత లాభం
3. లాక్‌డౌన్‌ పొడిగించడానికే నా మద్దతు
4. కరోనాను అధిగమించాలంటే లాక్‌డౌన్‌ ఒక్కటే మార్గం
5. అందుకే లాక్‌డౌన్‌ను పొడిగించాలని ప్రధాని మోదీని కోరుతున్నా
6. మరో ఒకటి రెండు వారాలు లాక్‌డౌన్‌‌ పొడిగిస్తే మంచిదే
7. లాక్‌డౌన్ కొనసాగించకపోతే.. ఇప్పటివరకూ పడిన శ్రమంతా ఆవిరై పోతుంది
8. కరోనా లక్షణాలున్నట్టు ఏమాత్రం అనుమానం ఉన్నా సమాచారమివ్వాలి
9. ఎవరైనా సరే కరోనా పాజిటివ్ వస్తే గాంధీ ఆస్పత్రిలో ఉండాల్సిందే
10. కరోనాపై పోరాడుతోన్న వైద్య సిబ్బందికి చేతులెత్తి మొక్కుతున్నా
11. ఇంటెలిజెన్స్ వ్యవస్థ చాలా బాగా పనిచేస్తోంది
12. మర్కజ్‌ వెళ్లిన వారిలో ఇప్పటి వరకూ 1080 మందిని గుర్తించాం
13. మర్కజ్‌ వెళ్లిన వారిలో 172 మందికి కరోనా సోకింది
14. గాంధీ ఆస్పత్రిలో 306 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు
15. తెలంగాణలో ఇప్పటివరకూ కరోనాతో 11 మంది మృతి చెందారు
16. దేశంలో ఎక్కడా మందుల కొరత లేదు

మరింత సమాచారాన్ని ఈ కింది లైవ్‌లో చూడండి..

ఇవి కూడా చదవండి:

సొంతూరికి వెళ్లడానికి శవం గెటప్.. ఐదుగురిపై కేసు

గాంధీ ఆసుపత్రిలో ‘కరోనా రోగి’ అదృశ్యం.. అసలేం జరిగిందంటే!

దేవాలయాల్లో క్వారంటైన్ కేంద్రాలా? మరెక్కడా చోటు లేదా?

ప్రముఖ నిర్మాత కుమార్తెకు కరోనా పాజిటివ్

వైసీపీ ప్రభుత్వం కూడా 5 వేలు ఇవ్వాలి: చంద్రబాబు

కర్ఫ్యూ సమయంలో కాగడాలతో హల్చల్, రాజాసింగ్ వీడియో వైరల్..