కరోనా టెస్టులు వద్దంటే జైలుకే..!

కరోనా వైరస్ గురించి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ బారిన పడి ఏడువేల మందికి పైగా మరణించారు. మరో రెండు లక్షల మంది వరకు వైరస్ సోకి ఆస్పత్రి పాలయ్యారు. అయితే తాజాగా మన దేశంలోకి కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే కరోనా ఎఫెక్ట్‌తో ముగ్గురు మరణించడంతో.. ప్రజలంతా భయం గుప్పిట్లో వణికిపోతున్నారు. అయితే కరోనా వైరస్‌ను అరికట్టేందుకు ప్రభుత్వాలు కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో యూపీ […]

కరోనా టెస్టులు వద్దంటే జైలుకే..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 17, 2020 | 1:18 PM

కరోనా వైరస్ గురించి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ బారిన పడి ఏడువేల మందికి పైగా మరణించారు. మరో రెండు లక్షల మంది వరకు వైరస్ సోకి ఆస్పత్రి పాలయ్యారు. అయితే తాజాగా మన దేశంలోకి కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే కరోనా ఎఫెక్ట్‌తో ముగ్గురు మరణించడంతో.. ప్రజలంతా భయం గుప్పిట్లో వణికిపోతున్నారు. అయితే కరోనా వైరస్‌ను అరికట్టేందుకు ప్రభుత్వాలు కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో యూపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

కరోనా పరీక్షలు తిరస్కరించినా.. కరోనా వైరస్ రోగులను దాచటానికి ప్రయత్నించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అంతేకాదు.. ప్రజలను భయందోళనలకు గురిచేసేలా వదంతులను వ్యాప్తి చేసినా.. కఠిన చర్యలు తప్పవని.. అలాంటి వారికి జైలు శిక్ష విధిస్థామని యూపీ సర్కార్ వెల్లడించింది. కరోనా పరీక్షలు చేస్తుంటే.. వైద్యులను అడ్డుకున్నా కూడా చర్యలు తీసుకుంటామని ఉత్తరప్రదేశ్ వైద్యఆరోగ్య శాఖ మంత్రి జైప్రతాప్ సింగ్ హెచ్చరించారు.కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో.. వైరస్‌ను ఎదుర్కనేందుకు అన్ని రకాల చర్యలను తీసుకునేందుకు.. అంటువ్యాధుల చట్టంలోని సెక్షన్ 3 కింద అధికారులకు అధికారం కల్పించామని మంత్రి తెలిపారు చెప్పారు. కరోనా వైరస్ సోకినట్లు అనుమానం కల్గిన వారు టెస్టులు చేయించుకోకుండా.. నిరాకరించినా.. ఆస్పత్రులనుంచి పారిపోయినా, డాక్టర్ల విధులను అడ్డుకున్నా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రాష్ట్రంలో కరోనా వ్యాప్తిచెందకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నామన్నారు. లక్నో, ఘజియాబాద్, నోయిడా, ఆగ్రాతో సహా రాష్ట్రంలోని 11 జిల్లాల్లో సినిమాహాళ్లు, మల్టీప్లెక్స్ లు, క్లబ్ లు, స్విమ్మింగ్ పూల్స్‌ను మూసివేసినట్లు తెలిపారు.