తెలుగు రాష్ట్రాల్లో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ల జాబితా.. ఆంక్షలు ఇవే..

తెలుగు రాష్ట్రాల్లో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ల జాబితా.. ఆంక్షలు ఇవే..

కరోనా కేసులను పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాలలోని జిల్లాలను రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించింది. ఇక లాక్ డౌన్‌ను మే 17 వరకు పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రెడ్ జోన్లలో ఎటువంటి సడలింపులు లేకుండా లాక్ డౌన్ కఠినంగా అమలు కానుంది. అయితే ఆరెంజ్, గ్రీన్ జోన్లలో మాత్రం పలు సడలింపులు ఇచ్చింది. కంటైన్‌మెంట్‌ ఏరియాస్: ప్రజల ఎంట్రీ, ఎగ్జిట్ నిషేధం. అంతేకాక ఈ ఏరియాలలో ఉంటున్నవారు […]

Ravi Kiran

|

May 01, 2020 | 10:06 PM

కరోనా కేసులను పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాలలోని జిల్లాలను రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించింది. ఇక లాక్ డౌన్‌ను మే 17 వరకు పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రెడ్ జోన్లలో ఎటువంటి సడలింపులు లేకుండా లాక్ డౌన్ కఠినంగా అమలు కానుంది. అయితే ఆరెంజ్, గ్రీన్ జోన్లలో మాత్రం పలు సడలింపులు ఇచ్చింది.

కంటైన్‌మెంట్‌ ఏరియాస్: ప్రజల ఎంట్రీ, ఎగ్జిట్ నిషేధం. అంతేకాక ఈ ఏరియాలలో ఉంటున్నవారు అత్యవసర వస్తువులకు ఇంటి నుంచి కేవలం ఒక్కరు మాత్రమే బయటికి రావాలి. మిగిలిన కమర్షియల్ సర్వీసులు అన్నీ కూడా మూసి ఉంటాయి.

రెడ్ జోన్లు: ఆటోలు, ట్యాక్సీలు, క్యాబ్స్, ప్రజా రవాణా, బార్బర్ షాపులు, స్పాస్, సెలూన్స్, మాల్స్ నిషేధం. కారుల్లో డ్రైవర్‌తో పాటు ఇద్దరు ప్యాసింజర్లు, అలాగే మోటార్ వెహికిల్స్‌పై ఒక్కరికి మాత్రమే అనుమతి ఉంటుంది. ఆఫీసులకు పరిమితమైన స్టాఫ్‌తో అనుమతి, ఈ- కామర్స్ సంస్థలు కేవలం అత్యవసర వస్తువులు మాత్రమే డెలివరీ చేయాలి.

ఆరెంజ్ జోన్లు: ఆటోలు, ట్యాక్సీలు, క్యాబ్‌లకు డ్రైవర్‌తో పాటు ఇద్దరు ప్యాసింజర్లకు అనుమతి, బస్సులకు అనుమతి లేదు.

గ్రీన్ జోన్లు: నేషనల్ వైడ్‌లో నిషేదించిన అన్నింటికీ ఇక్కడ అనుమతి ఉంది, బస్సులు 50 శాతం క్యాపాసిటీతో నడపవచ్చు.

తెలుగు రాష్ట్రాల్లో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లు…

రెడ్ జోన్: మేడ్చల్‌, వికారాబాద్‌, వరంగల్‌ అర్బన్‌, హైదరాబాద్‌, సూర్యపేట, రంగారెడ్డి, కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు

ఆరెంజ్ జోన్: నిజామాబాద్‌, గద్వాల, నిర్మల్‌, నల్లగొండ, ఆదిలాబాద్‌, సంగారెడ్డి, కామారెడ్డి, ఆసిఫాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, జగిత్యాల, సిరిసిల్ల, జయశంకర్‌ భూపాలపల్లి, మెదక్‌, జనగామ, నారాయణపేట, మంచిర్యాల, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కడప, అనంతపురం, శ్రీకాకుళం, ప్రకాశం, విశాఖపట్నం

గ్రీన్‌ జోన్: పెద్దపల్లి, నాగర్‌కర్నూల్‌, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, సిద్దిపేట, వరంగల్‌ రూరల్‌, వనపర్తి, యాదాద్రి, విజయనగరం

Read This: కొంపముంచిన వన్ బై టూ ఛాయ్… గుంటూరులో ఏకంగా 100 మందికి..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu