వైద్యాధికారుల విధులకు ఆటంకం.. ఒకరిపై కేసు నమోదు..

దేశ వ్యాప్తంగా నిత్యం ఎక్కడో ఓ చోట వైద్య సిబ్బందికి ఎవరో ఒకరు ఆటంకం కల్గిస్తూనే ఉన్నారు. ప్రభుత్వం ఎంత కఠిన నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించినా.. కొత్తగా చట్టాలను సవరించి హెచ్చరికలు చేసినా.. కొందరి ప్రవర్తనలో మార్పు ఉండటం లేదు. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ వ్యక్తి మెడికల్ ఆఫీసర్‌ విధులకు ఆటంకం కలిగించాడు. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మోటకొండూరు ఎస్సై వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. బెజ్జంకిబావికి […]

వైద్యాధికారుల విధులకు ఆటంకం.. ఒకరిపై కేసు నమోదు..
Follow us

| Edited By:

Updated on: May 01, 2020 | 10:28 PM

దేశ వ్యాప్తంగా నిత్యం ఎక్కడో ఓ చోట వైద్య సిబ్బందికి ఎవరో ఒకరు ఆటంకం కల్గిస్తూనే ఉన్నారు. ప్రభుత్వం ఎంత కఠిన నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించినా.. కొత్తగా చట్టాలను సవరించి హెచ్చరికలు చేసినా.. కొందరి ప్రవర్తనలో మార్పు ఉండటం లేదు. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ వ్యక్తి మెడికల్ ఆఫీసర్‌ విధులకు ఆటంకం కలిగించాడు. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

మోటకొండూరు ఎస్సై వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. బెజ్జంకిబావికి చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్‌ నుంచి స్వగ్రామానికి వచ్చాడు. అయితే సమాచారం అందుకున్న వైద్యాధికారి రాజేందర్‌.. నగరం నుంచి వచ్చిన వ్యక్తికి కౌన్సిలింగ్‌ ఇచ్చేందుకు వెళ్లగా.. అతడిపై దురుసుగా ప్రవర్తించాడు. దీంతో తన విధులకు ఆటంకం కల్గిస్తున్నారంటూ సదరు వైధ్యాధికారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. నిందితుడిపై గురువారం కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై వెంకన్న తెలిపారు.