లాక్‌డౌన్ 4.0: ఎస్‌బీఐ మరో కీలక నిర్ణయం..

లాక్‌డౌన్ గడువు పెరగడం వల్ల మే 31తో మారటోరియం కాలం ముగిసిన తర్వాత బ్యాంకులకు రుణాలు చెల్లించడం ప్రజలకు కష్టంగా మారుతుంది. వెంటనే వారికి డబ్బులు సర్దుబాటు కావు. అందుకే..

లాక్‌డౌన్ 4.0: ఎస్‌బీఐ మరో కీలక నిర్ణయం..
Follow us

|

Updated on: May 18, 2020 | 4:30 PM

లాక్‌డౌన్ క్రమంలో అన్ని రకాల లోన్లపై మూడు నెలల పాటు మారటోరియం విధిస్తూ.. ఆర్‌బీఐ నిర్ణయం తీసుకోగా.. ఈ నెలాఖరుతో గతంలో ప్రకటించిన మారటోరియం గడువు ముగియనుంది. అయితే, ఇప్పుడు లాక్‌డౌన్ పొడిగించిన క్రమంలో మారటోరియంను మరో మూడు నెలల పాటు ఆర్‌బీఐ పొడిగించే అవకాశముందని ఎస్‌బీఐ తన రీసెర్చ్ రిపోర్ట్‌లో పేర్కొంది. త్వరలోనే దీనిపై ఆర్‌బీఐ ప్రకటన చేసే అవకాశముందని తన రిపోర్ట్ వెల్లడించింది.

రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లలో కొన్ని సడలింపులను ఇస్తూ.. లాక్‌డౌన్ ను మే 17 వరకు పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆర్బీఐ మార్చి 27న ప్రకటించిన మూడు నెలల మారటోరియం మే 31తో ముగియనుంది. దాంతో మారటోరియాన్ని కూడా మరో మూడు నెలలు పొడిగిస్తూ ప్రకటన చేసింది ఆర్‌బీఐ. లాక్‌డౌన్ గడువు పెరగడం వల్ల మే 31తో మారటోరియం కాలం ముగిసిన తర్వాత బ్యాంకులకు రుణాలు చెల్లించడం ప్రజలకు కష్టంగా మారుతుంది. వెంటనే వారికి డబ్బులు సర్దుబాటు కావు. అందుకే మారటోరియం కాలాన్ని మరో మూడు నెలలు పెంచడం వల్ల అటు బ్యాంకులకు, ఇటు లోన్లు తీసుకున్న వారికి ఉపశమనంగా ఉంటుందని ఆర్బీఐ భావించింది. ఇప్పుడు ఆర్‌బీఐ బాటలోనే ఎస్‌బీ‌ఐ కూడా వెళ్లలనే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.