AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇప్పటికైనా మారండి- రాశీ ‘హిత బోధ’

టాలీవుడ్ బ్యూటీ రాశీ ఖన్నా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. వ్యక్తిగత విషయాలు, మూవీ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు ఫ్యాన్‌తో షేర్ చేసుకుంటుంది. అయితే తాజాగా లాక్‌డౌన్‌ ఇచ్చిన గుణపాఠంతో మనుషులు మారాలంటూ క్లాస్ ఇస్తోంది. అసలు సిసలైన ఆనందమేంటో గుర్తించండి అంటోంది. నిజమైన ఐశ్వర్యమేమిటో ఇకనైన తెలుసుకున్నారా..? అని ప్రశ్నిస్తోంది. ప్రస్తుత క్లిష్ట పరిస్థితులు చూశాకైనా ప్రతి ఒక్కరూ తమ ఆలోచనా విదానాలను మార్పుకోవాలని.. ఇకనుంచైనా సరికొత్తగా లైఫ్ స్టైల్‌ను మార్చుకోవాలని హిత బోధ చేస్తోంది. “ఇన్నాళ్లు […]

ఇప్పటికైనా మారండి- రాశీ 'హిత బోధ'
అలాగే నాగచైతన్య విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలోనూ నటిస్తుంది రాశి. కానీ కరోనా ఆంక్షలతో షూటింగ్‌ ఆగిపోవటంతో అర్థాంతరంగా ప్యాకప్ చెప్పేసి ఇంటి దారి పట్టారు. ప్రజెంట్‌ ఐసోలేషన్‌లో ఉన్న ఈ బ్యూటీ ఫ్యూచర్‌ మీద ఆశతో ఎదురుచూస్తుంది.
Sanjay Kasula
|

Updated on: Jun 27, 2020 | 6:03 AM

Share

టాలీవుడ్ బ్యూటీ రాశీ ఖన్నా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. వ్యక్తిగత విషయాలు, మూవీ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు ఫ్యాన్‌తో షేర్ చేసుకుంటుంది. అయితే తాజాగా లాక్‌డౌన్‌ ఇచ్చిన గుణపాఠంతో మనుషులు మారాలంటూ క్లాస్ ఇస్తోంది. అసలు సిసలైన ఆనందమేంటో గుర్తించండి అంటోంది. నిజమైన ఐశ్వర్యమేమిటో ఇకనైన తెలుసుకున్నారా..? అని ప్రశ్నిస్తోంది.

ప్రస్తుత క్లిష్ట పరిస్థితులు చూశాకైనా ప్రతి ఒక్కరూ తమ ఆలోచనా విదానాలను మార్పుకోవాలని.. ఇకనుంచైనా సరికొత్తగా లైఫ్ స్టైల్‌ను మార్చుకోవాలని హిత బోధ చేస్తోంది.

“ఇన్నాళ్లు పోటీ ప్రపంచంలో పడి పురుగులు తీశాం… సంపాదనలోనే సంతోషముందని భ్రమ పడ్డాం… స్వార్థంతో ప్రక‌ృతి ప్రసాదించిన సహజ వనరుల్ని ధ్వంసం చేసుకుంటూ పోయాం. మన ఉనికిని మనమే ప్రశ్నార్ధకం చేసుకునే స్థితికి చేరుకున్నాం. అయితే తాను మాత్రం ఈ ప్రశ్నలకు సమాధనాలు కొనుగొన్నానని అంటోంది. ఆరోగ్యమే గొప్ప సంపద… మానసిక ప్రశాంతతను సాధించుకోవడం గొప్ప విజయం.. సంతోషమే కొత్త విలువైన ఆస్తి ..” అంటూ పెద్ద ఎత్తున క్లాస్ తీసుకుంటోంది రాశీ ఖన్నా.