కరోనా ఎఫెక్ట్: ఆ రాష్ట్రంలో జూలై 31వరకు లాక్‌డౌన్..

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో మహమ్మారిని కట్టడి చేసేందుకు జులై 31వతేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు

కరోనా ఎఫెక్ట్: ఆ రాష్ట్రంలో జూలై 31వరకు లాక్‌డౌన్..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 27, 2020 | 6:38 AM

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో మహమ్మారిని కట్టడి చేసేందుకు జులై 31వతేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ఝార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రకటించారు. ఝార్ఖండ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో తాము లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు సీఎం చెప్పారు. లాక్ డౌన్ సందర్భంగా రాష్ట్రంలో సామాజిక, రాజకీయ, క్రీడలు, వినోదం, విద్యా, మతపరమైన కార్యక్రమాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు.

కరోనా కట్టడికోసం రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థలు, సినిమాహాళ్లు, జిమ్ లు, స్విమ్మింగ్ పూల్స్, పార్కులు, బార్ లు, ఆడిటోరియాలను మూసివేయాలని సీఎం సోరెన్ ఆదేశించారు. ఇతర రాష్ట్రాల నుంచి వాహనాల రాకపోకలను కూడా నిషేధించారు. షాపింగ్ మాల్స్, హోటళ్లు, ధర్మశాలలు, లాడ్జీలు, రెస్టారెంట్ లను మూసివేశారు. లాక్ డౌన్ సందర్భంగా రాత్రి 9 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు రోడ్లపై రాకపోకలను బంద్ చేశారు.ఆరు అడుగుల సామాజిక దూరం పాటించడంతోపాటు అందరూ మాస్క్ లు ధరించాలని సీఎం కోరారు.