రాహుల్ జన్మదినోత్సవంపై టీపీసీసీ కీలక నిర్ణయం

రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు సాదాసీదాగా జరపాలని పిలుపునిచ్చారు పీసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ఈ సమయంలో తమ ప్రియతమ నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను అత్యంత నిరాడంబరంగా జరుపనున్నామని అన్నారు.

రాహుల్ జన్మదినోత్సవంపై టీపీసీసీ కీలక నిర్ణయం
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 18, 2020 | 7:41 PM

రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు సాదాసీదాగా జరపాలని పిలుపునిచ్చారు పీసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ఈ సమయంలో తమ ప్రియతమ నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను అత్యంత నిరాడంబరంగా జరుపనున్నామని అన్నారు. తెలంగాణలో రాజకీయ నాయకులు శంకుస్థాపనల పేరుతో కరోనా నియమాలను ఉల్లంఘిస్తున్నప్పటికి, కాంగ్రెస్ పార్టీ మాత్రం కోవిడ్-19 మార్గదర్శకాలను పాటించి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ఫేస్ బుక్ వేదికగా కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.