కరోనాకు భారత ఆయుర్వేద చికిత్స.. అబ్బే ! ప్రిన్స్ ఛార్లెస్ పెదవి విరుపు

కరోనాకు భారత ఆయుర్వేద చికిత్స.. అబ్బే ! ప్రిన్స్ ఛార్లెస్ పెదవి విరుపు

నిజానికి  71 ఏళ్ళ ఛార్లెస్ కి ఆయుర్వేద వైద్యం పై ఎంతో నమ్మకం ఉంది. 2018 ఏప్రిల్ లో ప్రధాని మోదీ లండన్ ను సందర్శించి అక్కడ ఆయుర్వేద కేంద్రాన్ని ప్రారంభించినప్పుడు ఛార్లెస్ ఆయన వెంటే ఉన్నారు.

Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Apr 04, 2020 | 8:41 PM

భారత ఆయుర్వేద చికిత్స కారణంగా ప్రిన్స్ ఛార్లెస్ కరోనా వ్యాధి నయమైందని  కేంద్ర మంత్రి ఆయుష్ శ్రీపాద నాయక్ చేసిన వ్యాఖ్యలను ఆయన (ప్రిన్స్ చార్లెస్) కార్యాలయం ఖండించింది. బెంగుళూరులో సౌఖ్య ఆయుర్వేద అనే రిసార్టును నిర్వహిస్తున్న ఐజాక్ మతాయ్ అనే ఆయుర్వేద వైద్యుడు తాను ఇఛ్చిన ఆయుర్వేద, హోమియో మందుల కారణంగానే ప్రిన్స్ ఛార్లెస్ పూర్తిగా కోలుకున్నారని తనతో చెప్పినట్టు శ్రీపాద నాయక్ వెల్లడించారు. అయితే లండన్ లోని నేషనల్ హెల్త్ సర్వీసు స్టాఫ్ తనకు ఇఛ్చిన మందులు, వారి సేవల కారణంగానే తాను కరోనా నుంచి బయటపడ్డానని ఛార్లెస్ పేర్కొన్నట్టు తెలిసింది. పైగా వారి సేవలను ఆయన ప్రశంసించారు కూడా.. భారత మంత్రి ఆయుష్ శ్రీపాద నాయక్ చేసిన ప్రకటనను ఛార్లెస్ కార్యాలయం తోసిపుచ్చింది. నిజానికి  71 ఏళ్ళ ఛార్లెస్ కి ఆయుర్వేద వైద్యం పై ఎంతో నమ్మకం ఉంది. 2018 ఏప్రిల్ లో ప్రధాని మోదీ లండన్ ను సందర్శించి అక్కడ ఆయుర్వేద కేంద్రాన్ని ప్రారంభించినప్పుడు ఛార్లెస్ ఆయన వెంటే ఉన్నారు. కానీ కరోనాకు సంబంధించినంత వరకు తను నేషనల్ హెల్త్ సర్వీసు సిబ్బంది చేసిన సేవలవల్లే పూర్తిగా కోలుకున్నానని ఛార్లెస్ స్పష్టం చేసినట్టు చెబుతున్నారు. గత మంగళవారం ఆయన సెల్ఫ్ ఐసోలేషన్ నుంచి బయటికి వఛ్చి లండన్ లో కరోనా బాధితుల చికిత్స కోసం ఓ ఆసుపత్రిని ప్రారంభించారు కూడా.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu