వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్

భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది కేంద్ర ఎన్నికల సంఘం. దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి పెరుగుతుండటం. వ్యాక్సిన్ ఇప్పుడప్పుడే వచ్చేట్లు కనిపించడం లేదు. దీంతో 65 ఏళ్ల పైబడిన వారు పోస్టల్‌ బ్యాలెట్‌ను...

వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్
Follow us

|

Updated on: Jul 02, 2020 | 9:31 PM

భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది కేంద్ర ఎన్నికల సంఘం. దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి పెరుగుతుండటం… వ్యాక్సిన్ ఇప్పుడప్పుడే వచ్చేట్లు కనిపించడం లేదు. దీంతో 65 ఏళ్ల పైబడిన వారు పోస్టల్‌ బ్యాలెట్‌ను ఉపయోగించి ఓటు వేసేందుకు ఎన్నికల కమిషన్‌ అనుమతి ఇచ్చింది. అక్టోబర్‌-నవంబర్‌లో బీహార్‌ శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. 243 శాసన సభ నియోజకవర్గాల్లో ఈ ఎన్నికలు జరుగనున్నాయి. తాజాగా ఎన్నికలపై కూడా దీని ప్రభావం స్పష్టంగా ఉండనుంది. అయితే వయసుపై బడిన వారు, మధుమేహం, రక్తపోటు ఉన్న వారికి కొవిడ్‌-19 ముప్పు ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

గతంలో పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం 80 ఏళ్లకు పైబడినవారికి, ఇతర రాష్ట్రాల్లో అత్యవసర విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే సిబ్బందికి ఉండేది. ఇప్పుడు 80 నుంచి 65 ఏళ్లకు కుదించారు. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో ఈ వివరాలను పొందుపరిచారు. ఇటువంటి దుర్భర పరిస్థితుల్లో కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని అంతా అభినందిస్తున్నారు.