Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Narendra Modi: నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్‌ సమావేశం.. కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సన్నాహాలు..!

India COVID-19 situation: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. నిత్యం మూడున్నర లక్షలకు పైగా కోవిడ్-19 కేసులు నమోదవుతున్నాయి. దీంతోపాటు మరణాల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. మూడు వేలకుపైగా కరోనా బాధితులు ప్రాణాలు

Narendra Modi: నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్‌ సమావేశం.. కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సన్నాహాలు..!
Pm Narendra Modi
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 30, 2021 | 8:34 AM

India COVID-19 situation: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. నిత్యం మూడున్నర లక్షలకు పైగా కోవిడ్-19 కేసులు నమోదవుతున్నాయి. దీంతోపాటు మరణాల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. మూడు వేలకుపైగా కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ కరోనా సెకండ్ వేవ్ మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం కేంద్ర క్యాబినెట్‌ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన నియంత్రణ చర్యలపై, దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో మంత్రులతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు సైతం పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు వర్చువల్‌ ద్వారా ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ… వివిధ రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులపై సమీక్షించనున్నారు. దీంతోపాటు ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్‌, కరోనా వ్యాక్సిన్, దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ, అత్యవసరమైన ఔషధాలు తదితర ముఖ్యమైన అంశాలపై మంత్రులతో, అధికారులతో చర్చించనున్నారు.

కాగా.. కరోనా మహమ్మారిని నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై గత వారం రోజులుగా ప్రధాని మోదీ దాదాపు ప్రతి రోజూ ఉన్నత స్థాయి అధికారులు, వైద్యులు, శాస్త్రవేత్తలతో సమావేశమవుతున్నారు. దీంతోపాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ సమావేశమై ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న సమస్యలపై చర్చించారు. దేశంలో ఆక్సిజన్‌ కొరతను తగ్గించేందుకు జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రుల్లో కొత్త ఆక్సిజన్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు కేంద్రం పీఎం కేర్‌ నుంచి నిధులు విడుదల చేసింది. అలాగే దేశంలోని పలు ప్లాంట్ల నుంచి ఆక్సిజన్‌‌ను సరఫరా చేసేందుకు వేగంగా ఏర్పాట్లు చేసింది. దీంతోపాటు పలు దేశాల నుంచి ఔషధ సామాగ్రి, ఆక్సిజన్, ఔషధాల దిగుమతిపై కీలక నిర్ణయాలు తీసుకుంది.

అయితే.. దేశంలో కరోనా కేసులు, మరణాలు పెరుగుతున్న దృష్ట్యా మరోసారి లాక్‌డౌన్ ఉంటుందని ఊహగానాలు వినిపిస్తున్నాయి. అంతకుముందు ప్రధాని మోదీ మాట్లాడుతూ.. లాక్‌డౌన్ ఉండదంటూ క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే పలు అధ్యయనాలు.. మే నెలలో దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రమవుతుందని.. మరణాలు కూడా 5వేలు దాటుతాయని హెచ్చరించాయి. ఈ తరుణంలో కరోనా వ్యాప్తి కట్టడికి.. మరో లాక్‌డౌన్ తప్పదంటూ సంకేతాలు ఇచ్చాయి. ఈ తరుణంలో.. ఈ రోజు జరిగే సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

Also Read:

Horoscope Today: ఆ రాశుల వారందరికీ వ్యతిరేక ఫలితాలే.. శుక్రవారం రాశి ఫలాలు ..

Petrol, Diesel price Today: దేశంలో స్థిరంగానే కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లోనే మార్పులు