జనతా కర్ఫ్యూ తర్వాత ప్రజలకు మోదీ మరో సూచన

ఇవి కేవలం చప్పట్లు మాత్రమే కాదని.. కరోనా వైరస్‌పై పోరాటంలో విజయనినాదమని ఆయన అన్నారు. కరోనా మీద పోరాడుతున్న ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు..

  • Tv9 Telugu
  • Publish Date - 6:23 pm, Sun, 22 March 20
జనతా కర్ఫ్యూ తర్వాత ప్రజలకు మోదీ మరో సూచన

కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడానికి ‘జనతా కర్ఫ్యూ’లో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని ప్రధాని పిలుపునిచ్చారు. అదేవిధంగా వైద్యులకు, శాస్త్రవేత్తలకు, కార్మికులకు సాయంత్రం 5 గంటలకు చప్పట్లతో థ్యాంక్స్‌ చెప్పాలన్నారు. అదే విధంగా.. ఆదివారం జనతా కర్ఫ్యూని ప్రతీ ఒక్కరూ విధిగా పాటించారు. సాయంత్రం 5 గంటలకు ఇళ్ల బయటకు వచ్చి.. చప్పట్లతో కరోనాపై యుద్ధం చేశారు. అలాగే కరానాపై పోరాడుతున్న వైద్యులు, నర్సులు, పోలీసులు, ఇతరులకు సంఘీభావం తెలిపారు. ఢిల్లీ లాంటి మహానగరాల నుంచి మారుమూల పల్లెటూళ్ల వరకూ ప్రజలు ఇలా చప్పట్లు కొట్టి తమ వంత మద్దతు తెలిపారు. ఈ క్రమంలో తాను పిలుపునిచ్చినట్టు చప్పట్లు కొట్టిన వానందరికీ అభినందనలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇవి కేవలం చప్పట్లు మాత్రమే కాదని.. కరోనా వైరస్‌పై పోరాటంలో విజయనినాదమని ఆయన అన్నారు. కరోనా మీద పోరాడుతున్న ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. దేశ ప్రజలందరికీ ధన్యవాదాలు. కానీ అప్పుడే దీనిపై గెలిచినట్టు కాదు.. ఇది ఆరంభం మాత్రమే అన్నారు. ఇదే సంకల్పంతో, ఈ సమయంలో మరో సుదీర్ఘ పోరాటం చేద్దాం. మనల్ని మనం స్వీయ నిర్బంధంలో ఉంచుకుందామని పేర్కొన్నారు ప్రధాని మోదీ.

Read more also:

ఇంట్లో ఉంటే కరోనా రాదనుకుంటే పొరపాటే.. సూచనలు ఇవే!

బ్రేకింగ్ న్యూస్: ఈ నెల 31 వరకూ బస్సులు, రైళ్లు సర్వీసులు బంద్

 కరోనా సోకిన వారిలో చనిపోయే ఛాన్స్ ఎక్కువగా పురుషులకే ఉందట..

కరోనా సోకిన వారిలో చనిపోయే ఛాన్స్ ఎక్కువగా పురుషులకే ఉందట..