కరోనా బాధితులకు ‘ఫోన్ పే’ ఇన్సూరెన్స్..

| Edited By:

Apr 02, 2020 | 8:51 AM

ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ యాప్ ఫోన్ పే కేవలం రూ.156లకే బీమా పాలసీని తీసుకువచ్చింది. బజాజ్ అలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ భాగస్వామ్యంతో 'కరోనా కేర్' పేరుతో ఈ బీమాను అందుబాటులోకి తెచ్చింది. కరోనా వైరస్ బారిన పడి ఆస్పత్రిలో చేరిన..

కరోనా బాధితులకు ఫోన్ పే ఇన్సూరెన్స్..
Follow us on

దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతూనే ఉంది. ఒకానొక సమయంలో వైరస్ తగ్గుముఖం పడింది అనుకునేలోపే.. ఢిల్లీలోని మార్కజ్‌లో జరిగిన ముస్లింల ప్రార్థనతో ఇది మరింత తీవ్రతరం అయ్యింది. ఇప్పటివరకూ ఇండియాలో 1800లకి పైగానే ఈ వైరస్ బారిన పడ్డారు. వారిలో 133 మంది కోలుకోగా.. 45 మందికి పైగానే మృత్యువాత పడ్డారు. దీంతో ప్రజల్లో మరింత భయాందోళన పెరుగుతుంది.

ఈ నేపథ్యంలో ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ యాప్ ఫోన్ పే కేవలం రూ.156లకే బీమా పాలసీని తీసుకువచ్చింది. బజాజ్ అలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ భాగస్వామ్యంతో ‘కరోనా కేర్’ పేరుతో ఈ బీమాను అందుబాటులోకి తెచ్చింది. కరోనా వైరస్ బారిన పడి ఆస్పత్రిలో చేరిన వారి వైద్య ఖర్చులకు ఆసరాగా ఈ బీమా ఉంటుందని ఫోన్ పే సంస్థ అధికారులు పేర్కొన్నారు. ఒకేసారి రూ.156 చెల్లించి బీమా తీసుకుంటే వైద్య ఖర్చుల నిమిత్తం రూ.50 వేల వరకూ ఫోన్ పే చెల్లించనుందని తెలిపారు.

అలాగే హాస్పిటల్‌లో చేరడానికి ముందు.. ఆ తరువాత మొత్తం 30 రోజుల పాటు వైద్య పరీక్షలు, మందుల కొనుగోలు అయ్యే తదితర ఖర్చులను కూడా ఫోన్ పే చెల్లిస్తుందని.. కాకపోతే ఈ బీమాను కొనుగోలు చేసిన 15 రోజుల్లోగా కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్లు గుర్తిస్తేనే ఇది చెల్లుబాటు అవుతుందన్నారు. 55 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న వారు మాత్రమే దీనికి అర్హులవుతారన్నారు.

ఇవి కూడా చదవండి: 

అనంతపురంలో నకిలీ మద్యం కలకలం.. ప్రాణాలతో చెలగాటం

ఆ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. జీతాలతో పాటు ఇన్సెంటీవ్స్‌ కూడా

మరో నటుడ్ని బలితీసుకున్న కరోనా.. శోక సంద్రంలో సినీ పరిశ్రమ

కరోనా ఎఫెక్ట్: స్థానికున్ని కొట్టి చంపిన యువకులు

కరోనా దెబ్బ.. మోదీ సర్కార్ భారీ అప్పు

లాక్‌డౌన్: మూగ జీవాలకు ప్రభుత్వం అండ.. రూ.54 లక్షలు నిధులు

కరోనా వైరస్: ప్రపంచంలో టాప్ 10 హై రిస్క్ అండ్ సేఫ్ కంట్రీస్ ఇవే!

వైన్స్‌‌ షాపులపై తప్పుడు ప్రచారం.. వ్యక్తి అరెస్ట్