Coronavirus: కరోనా మహమ్మారి (Corona) మరోసారి దండయాత్ర చేస్తోంది. మూడో వేవ్ రూపంలో విరుచుకుపడుతోంది. మొదటి రెండు వేవ్‌లలో కరోనా నుంచి తప్పించుకున్న వారు సైతం మూడో వేవ్‌లో దీని బారిన పడుతున్నారు. అయితే కరోనా ఎంత ప్రమాదకరమే అంత తేలికైంది కూడా. సరైన ఆహారం, జీవన శైలితో కేవలం వారం రోజుల్లో ఈ వైరస్‌ను జయించవచ్చు. నిపుణులు కూడా ఇదే విషయాన్నిచెబుతున్నారు. ఇదిలా ఉంటే కరోనా సోకిన వారు కొన్ని ఆహార పదార్థాలకు కచ్చితంగా దూరంగా ఉండాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
* ప్యాకేజ్‌డ్ ఫుడ్ జోలికి ఎట్టిపరిస్థితుల్లో వెళ్ల కూడదు. ఓపిక లేదని ఇన్‌స్టాంట్‌గా దొరుకుతాయని వీటిని తినకూడదు. ఎందుకంటే ప్యాకేజ్‌డ్ ఫుడ్స్‌లో సోడియంతో పాటు ప్రిజర్వేటివ్స్‌ను ఉపయోగిస్తారు. ఇవి శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను పెంచుతాయి. దీంతో కరోనా నుంచి కోలుకునే సమయం ఇంకా పెరుగుతుంది.
* కరోనా సమయంలో సహజంగానే దగ్గుతో బాధపడుతుంటాం.. అలాంటిది గొంతును ఇబ్బంది పెట్టేలా కారం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల జోలికి అస్సలు వెళ్లకూడదు. కారం కంటే మిరియాలు ఎక్కువగా తీసుకుంటే మంచిది. ఇందులోని యాంటీబ్యాక్టీరియల్, యాంటీమైక్రోబియల్ గుణాలు వ్యాధి నుంచి కోలుకోవడానికి దోహదపడతాయి.
* వేపుళ్లకు దూరంగా ఉండాలి. దీనికి కారణం సహజంగానే ఇవి జీర్ణం కావడానికి సమయం పడుతుంది. అదీ కాకుండా కరోనా సమయంలో జీర్ణ వ్యవస్థ నెమ్మదిస్తుంది. ఫలితంగా వ్యాధి నిరోధశక్తి కూడా తగ్గుతుంది. కాబట్టి వైరస్ నుంచి కోలుకోవడానికి సమయం ఎక్కువుతుంది. కాబట్టి వేపుళ్లకు వీలైనంత దూరంగా ఉండాలి.
* ఇక కరోనా సోకిన వారు కచ్చితంగా కూల్ డ్రింక్స్‌కి దూరంగా ఉండాలి. షుగర్ ఎక్కువగా ఉండే కూల్ డ్రింక్స్ శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను పెంచి, కోలుకునే వేగాన్ని తగ్గిస్తాయి. కాబట్టి వీటికి బదులుగా మజ్జిగ, సోడా కలిపిన నిమ్మరసం లాంటివి తీసుకోవాలి.
Also Read: IND vs SA: 223 పరుగులకే చాప చుట్టేసిన భారత్.. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ..
America Suffers: కరోనా కరాళనృత్యానికి అగ్రరాజ్యం విలవిల.. ప్రపంచ దేశాలకు అమెరికానే ఓ గుణపాఠం
PM Narendra Modi: దేశంలో మరో లాక్‌డౌన్..? 13న సీఎంలతో ప్రధాని మోదీ కీలక సమావేశం..