COVID 19: చైనాలో కరోనా విలయతాండవం.. ఏకంగా 90 కోట్ల మందికి సోకిన మహమ్మారి

|

Jan 14, 2023 | 11:58 AM

గత నెలలో చైనాలో కోవిడ్‌ ఆంక్షలు ఎత్తివేసినప్పటి నుంచి జనవరి 11 నాటికి దాదాపు 900 మిలియన్ల (90 కోట్లు) చైనా ప్రజలు కోవిడ్ బారిన పడ్డారు. అంటే ఆ దేశ జనాభాలో దాదాపు 64 శాతం..

COVID 19: చైనాలో కరోనా విలయతాండవం.. ఏకంగా 90 కోట్ల మందికి సోకిన మహమ్మారి
Covid 19 Infections In China
Follow us on

గత నెలలో చైనాలో కోవిడ్‌ ఆంక్షలు ఎత్తివేసినప్పటి నుంచి జనవరి 11 నాటికి దాదాపు 900 మిలియన్ల (90 కోట్లు) చైనా ప్రజలు కోవిడ్ బారిన పడ్డారు. అంటే ఆ దేశ జనాభాలో దాదాపు 64 శాతం అన్నమాట. వాయువ్య చైనాలోని గన్స్‌ ప్రావిన్స్‌లో ఏకంగా 91 శాతం (239 మిలియన్లు) మందికి, యునాన్ ప్రావిన్స్‌లో 84 శాతం, కింఘాయ్ ప్రావిన్స్ లో 80 శాతం మందికి కోవిడ్ సోకినట్లు పెకింగ్ యూనివర్సిటీ అధ్యయనాలు వెల్లడించాయి.

ఇక కోవిడ్ ఉధృతి వచ్చే రెండు మూడు నెలల్లో గరిష్ట స్థాయికి చేరుకుంటుందని చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ మాజీ హెడ్ జెంగ్ గువాంగ్ మీడియాకు తెలిపారు. జనవరి 23 నుంచి చైనా గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్‌ మరింత ప్రభలమవుతుందని అంచనా వేస్తున్నారు. అందుకు కారణం లేకపోలదు. చైనాలో లూనార్ న్యూ ఇయర్‌ జనవరి 23న ప్రారంభమవుతుంది. ఈ టైంలో దాదాపు రెండు బిలియన్ల ప్రజలు సొంతూళ్లకు పయనమవుతారు. దీంతో అక్కడ కూడా కేసులు భారీగా పెరిగే అవకాశముంది.

మరోవైపు బీజింగ్, షాంఘై వంటి నగరాల నుంచి అందిన సమాచారం మేరకు చైనాలో కోవిడ్‌ రోగులతో అక్కడి ఆసుపత్రులు కిక్కిరిసిపోయాయి. పట్టణ ప్రాంతాల్లోనే వైద్య సదుపాయాలు అందించలేక చేతులెత్తేసిన చైనా.. గ్రామీణ ప్రాంతంలో ఏ మేరకు చర్యలు చేపడుతుందోనని విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకు కేవలం 5 వేల కోవిడ్ మరణాలు మాత్రమే సంభవించాయని చెబుతోన్న చైనా కళ్లబొల్లి మాటలు చెబుతోంది. అక్కడ నమోదవుతున్న మరణాల గురించి చైనా పెదవి విప్పనప్పటికీ వాస్తవం వేరేలా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సైతం హెచ్చరిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తాకథనాల కోసం క్లిక్‌ చేయండి.