Karnataka Curfew: డిసెంబర్ 28 నుంచి పది రోజుల పాటు రాత్రి కర్ఫ్యూ.. కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం

Omicron Variant: దేశవ్యాప్తంగా మరోసారి కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి. ఒమిక్రాన్ ముప్పు పెరుగుతున్న వేళ.. కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Karnataka Curfew:  డిసెంబర్ 28 నుంచి పది రోజుల పాటు రాత్రి కర్ఫ్యూ.. కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం
Karnataka Night Curfew

Edited By: Anil kumar poka

Updated on: Dec 27, 2021 | 6:40 PM

Karnataka Night Curfew: దేశవ్యాప్తంగా మరోసారి కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి. ఒమిక్రాన్ ముప్పు పెరుగుతున్న వేళ.. కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 28 నుంచి పది రోజుల పాటు రాత్రి సమయంలో కర్ఫ్యూ విధించనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ఆదివారం ప్రకటించారు. అంతే కాకుండా నూతన సంవత్సర వేడుకల వేళ ఎక్కువ మంది జనాలు ఒకచోట గుమికూడకుండా ఆంక్షలు విధించారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య 144 సెక్షన్ అమల్లో ఉంటుందని కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి కె.సుధాకర్ తెలిపారు. న్యూ ఇయర్ సందర్భంగా జరిపే పార్టీలు, జనం గుమికూడటంపైనా ఆంక్షలు విధించారు. దేశంలో ఒమైక్రాన్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి. దీంతో కొంత కాలం పాటు ఆంక్షలు తప్పవని ఆ రాష్ట్ర అధికారులు అంటున్నారు.

కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై నేతృత్వంలో సీనియర్ మంత్రులు, అధికారులు, కోవిడ్ సాంకేతిక సలహా కమిటీ సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. న్యూ ఇయర్ గేదరింగ్స్, ఫంక్షన్లపైనా ఆంక్షలు విధించారు. బయటి ప్రదేశాల్లో ఫంక్షన్లు, పార్టీల్లాంటి జరపడానికి వీల్లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్యంగా డీజేలు, భారీగా జనం గుమికూడటంపై నిషేధం విధించారు. హోటల్స్, పబ్‌లు, రెస్టారెంట్లు మొదలైనవి.. 50 శాతం సీటింగ్ కెపాసిటీతో నడుపుకోవచ్చని ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. ప్రజలందరూ మాస్కులు ధరించాలని, నైట్ కర్ఫ్యూ సమయంలో ప్రజలు బయటకు వస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

మన దేశంలో ఇప్పటి వరకూ 422కిపైగా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా మహారాష్ట్ర, ఢిల్లీల్లో కొత్త వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. కర్ణాటకలో 31 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా.. 15 మంది రికవరీ అయ్యారు.

Read Also… Punjab Elections 2022: పంజాబ్ ఎన్నికల సంగ్రామానికి సిద్దమవుతున్న కాంగ్రెస్.. జనవరి 3 నుంచి రాహుల్ గాంధీ ప్రచారం షురూ!